కరోనాను జయిస్తున్న భారతీయులు: ఒక్క రోజే 51,706 మంది డిశ్చార్జ్

By Siva KodatiFirst Published Aug 5, 2020, 5:31 PM IST
Highlights

దేశంలో రోజుకు అర లక్షకు పైగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నప్పటికీ.. మరోవైపు ఈ మహమ్మారి కోరల్లోంచి బయటపడుతున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది

దేశంలో రోజుకు అర లక్షకు పైగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నప్పటికీ.. మరోవైపు ఈ మహమ్మారి కోరల్లోంచి బయటపడుతున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది.

భారత్‌లో కోవిడ్‌తో చికిత్స పొందుతున్న వారి కంటే కోలుకొని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా డిశ్చార్జ్‌ల్లో మంగళవారం కొత్త రికార్డు నమోదైంది. ఈ ఒక్క రోజే 51,706 మంది కోలుకున్నారు.

ఇప్పటి వరకు దేశంలో ఒక్క రోజులో కోలుకున్న వారి సంఖ్యతో పోలిస్తే ఇదే అత్యథికం.  దేశంలో ఇప్పటి వరకు 19,08,254 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వీరిలో 12,82,215 మంది కోలుకోగా.. 39,795 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం 5,86,244 మంది దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 14 రోజులతో పోలిస్తే ఈ రేటు 63 శాతం నుంచి 67 శాతానికి పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 67.19 శాతం ఉండగా.. మరణాల రేటు 2.09 శాతంగా ఉంది.

అలాగే, దేశంలో యాక్టివ్ కేసులు 30.72 శాతంగా ఉన్నాయి. ఇకపోతే కరోనా టెస్టులు కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 1,366 ల్యాబోరేటరీల్లో కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరుగుతున్నాయి. 

click me!