వీధుల్లో తోపుడు బండితో సీఎం.. అందరూ బొమ్మలు వేస్తుంటే ముందుకు.. (వీడియో)

Published : May 25, 2022, 08:19 PM IST
వీధుల్లో తోపుడు బండితో సీఎం.. అందరూ బొమ్మలు వేస్తుంటే ముందుకు.. (వీడియో)

సారాంశం

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ నగర వీధుల్లో తోపుడు బండిని తోస్తూ వెళ్లాడు. కిక్కిరిసిన జనం ఆయన తోస్తున్న బండిపై బొమ్మలు, పుస్తకాలు, ఇతర వస్తువులను విరాళం ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాలను దత్తత తీసుకోవాలనే ప్రభుత్వ పిలుపులో భాగంగా సీఎం ఈ కార్యక్రమం నిర్వహించారు.  

భోపాల్: ఆయన ముఖ్యమంత్రి. ఆయన బయటకు వచ్చాడంటే.. వెనుకా ముందు డజన్ కార్లు ఉండాల్సిందే. పెద్ద కాన్వాయ్‌లో ప్రయాణించే సీఎం.. సడెన్‌గా నడి రోడ్డు మీదకు వచ్చాడు. వీధుల్లో తోపుడు బండి తోస్తూ మరీ కనిపించాడు. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ నగర వీధుల్లోకి వచ్చి తోపుడు బండిని తోస్తూ ముందుకు వెళ్లారు. కాగా, వీధుల్లో కిక్కిరిసిన ప్రజలు బొమ్మలు, పుస్తకాలు ఉచితంగా విరాళం ఇచ్చారు. అందరూ ఆ తోపుడు బండిపై వేస్తుండగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ముందుకు వెళ్లారు.

రాష్ట్ర ప్రభుత్వం నడిపే అంగన్వాడీ కేంద్రాలకు పుస్తకాలు, బొమ్మలు, ఇతర వస్తువులను విరాళం ఇవ్వాలని అధికారులు కోరారు. వీటిని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా సేకరించడానికి వీధుల్లోకి వచ్చాడు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి రాష్ట్ర విద్య, వైద్య శాఖ మంత్రి వైష్ణవ్ సారంగ్, ఎమ్మెల్యే, మాజీ భోపాల్ మేయర్ క్రిష్ణ గౌర్, ఇతర నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. చాలా మంది కిక్కిరిసి ఉన్నారు. పిల్లలు కూడా పిగ్గీ బ్యాంకులు పట్టుకుని సీఎం తోపుడు బండిలో వేయడానికి ఎదురుచూశారు. 

మూడు గంటల్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 800 మీటర్లు తోపుడు బండితో ముందుకు వెళ్లాడు. ఈ దూరంలోనే సీఎం పది ట్రక్కుల ఆట బొమ్మలు, పుస్తకాలు, స్టేషనరీలు, చెక్‌లు కలెక్ట్ చేశాడు. మొత్తం రూ. 2 కోట్ల విలువైన వాటిని సీఎం కలెక్ట్ చేశాడు. కొందరైతే టీవీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఇతర వస్తువులు కూడా అంగన్వాడీ కేంద్రాల కోసం విరాళం ఇచ్చారు.

ఈ వస్తువులను భోపాల్‌లోని 1,800 అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేయనున్నారు.

అంగన్వాడీలను దత్తత తీసుకోవాలన్న కార్యక్రమంలో భాగంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ తోపుడు బండి ప్రోగ్రామ్ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని సెలెబ్రిటీలు సమర్థించారు. అక్షయ్ కుమార్, నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యర్థి, ప్రముఖ కవి కుమార్ విశ్వాస్ సహా పలువురు సెలెబ్రిటీలు ప్రభుత్వ పిలుపునకు స్పందించి ముందుకు వచ్చారు. రూ. 1 కోటిని విరాళం ఇస్తున్నట్టు అక్షయ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలో 50 అంగన్వాడీ కేంద్రాలను దత్తత తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

ఇదేం చలిరా నాయనా..! చివరకు గోవులకు కూడా దుప్పట్లా..!!
Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu