క్రూరులతో సావాసం: సెంటినలీస్‌తో గడిపిన సాహస వనిత

By sivanagaprasad kodatiFirst Published Dec 3, 2018, 11:38 AM IST
Highlights

ఇటీవలి అమెరికన్ పౌరుడిని అండమాన్ నికోబార్ దీవుల్లోని సెంటినలీస్ తెగ అత్యంత దారుణంగా హతమార్చిన తర్వాత  ఈ తెగ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఆధునిక మానవుడిని కనిపిస్తే చంపేదాకా వదిలిపెట్టని వారితో స్నేహం చేసి.. సెంటినలీస్ ప్రేమాభిమానాలు పొందారు సామాజిక శాస్త్రవేత్త, ప్రకృతి ప్రేమికురాలు మధుమాల చటోపాధ్యాయ.

ఇటీవలి అమెరికన్ పౌరుడిని అండమాన్ నికోబార్ దీవుల్లోని సెంటినలీస్ తెగ అత్యంత దారుణంగా హతమార్చిన తర్వాత  ఈ తెగ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించుకోవడం మొదలుపెట్టారు.

ఆధునిక మానవుడిని కనిపిస్తే చంపేదాకా వదిలిపెట్టని వారితో స్నేహం చేసి.. సెంటినలీస్ ప్రేమాభిమానాలు పొందారు సామాజిక శాస్త్రవేత్త, ప్రకృతి ప్రేమికురాలు మధుమాల చటోపాధ్యాయ. ఈ తెగ గురించి ప్రస్తుతం విపరీతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాను 1999లో సెంటినలీస్‌ను తొలిసారిగా కలిసిన విషయాలను వెల్లడించారు.

బయటి ప్రపంచానికి దూరంగా ఉండే సెంటినలీస్ చాలా బలంగా ఉంటారని..50 ఏళ్లు ఉండే మధ్య వయస్కుడు ధృఢంగా ఉండే ఐదుగురు యువకులను సైతం అవలీలగా మట్టికరిపిస్తారని మధుమాల పేర్కొన్నారు. నిజానికి సెంటినలీస్ ముందుగా దాడికి దిగరని తెలిపారు.

తమ హెచ్చరికలను లెక్క చేయకుండా వారి ప్రపంచంలోకి అడుగుపెడితేనే వారు మూకుమ్మడిగా దాడికి దిగుతారని చెప్పారు. పరిశోధనలో భాగంగా మధుమాల చటోపాధ్యాయ నెలల తరబడి సెంటినలీస్‌తో గడిపారు. ఒక రోజు తిరిగి బయలుదేరుతుండగా... కాసేపట్లో వర్షం కురుస్తుందని, వెళ్లొద్దని వాళ్లు హెచ్చరించారట.

అయినప్పటి అడుగు ముందుకు వేయగా... అప్పటిదాకా కాసిన మండుటెండ మాయమై పెద్ద వర్షం కురిసిందని ఆమె వెల్లడించారు. వాళ్లు ప్రకృతితో ఎంతగా లీనమయ్యారో చెప్పడానికి ఇదోక ఉదాహరణ అన్నారు.

అలాగే సెంటినలీస్ అంతిమ సంస్కారాలు ప్రత్యేకంగా ఉంటాయని... మరణించిన వారిని పోలినట్లుండే ఒక చెక్క బొమ్మను తయారు చేసి.. దాని పక్కనే వారికి ఇష్టమైన ఆహారాన్ని, నీటిని పెడతారని వివరించారు. సెంటినలీస్ తనను ‘‘మిలాలే, మిలాలే’’ అని పిలచేవారన్నారు.. వారి భాషలో మిలాలే అంటే మిత్రులని అర్థమట.

కొద్దిరోజుల కిందట జాన్ అలెన్ చౌ అనే క్రిస్టియన్ అమెరికన్ మిషనరీ వ్యవస్థాపకుడు.. నాగరిక ప్రపంచాన్ని వారికి పరిచయం చేయాలని, క్రైస్తవ సిద్ధాంతాలను బోధించాలంటూ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ఉత్తర సెంటినల్ ద్వీపంలోకి అడుగుపెట్టడంతో సెంటినలీస్ ఆయనను బాణాలతో అత్యంత దారుణంగా హతమార్చారు. జాన్ మృతదేహం కోసం ఇప్పటికీ కేంద్రప్రభుత్వం గాలిస్తోంది. 

మనుషులు కనిపిస్తే ఖతమే.. ప్రపంచానికి దూరంగా ‘‘సెంటినలీ’’ తెగ

click me!