డీఎంకే అధినేతగా స్టాలిన్ ఎకగ్రీవ ఎన్నిక

By ramya neerukondaFirst Published Aug 28, 2018, 11:04 AM IST
Highlights

70ఏళ్ల డీఎంకే చరిత్రలో స్టాలిన్ మూడో అధ్యక్షుడు. గత 50 ఏళ్లుగా కరుణానిధి అధ్యక్షుడిగా ఉండగా.. ఇప్పుడు స్టాలిన్ అధ్యక్ష పదవిని చేపట్టారు.

ద్ర‌విడ మున్నేత్ర‌ క‌జ‌గం(డీఎంకే) పార్టీ అధినేత‌గా ఎంకే స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరుణానిధి ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎంకే అధ్యక్ష పదవికి ఎన్నిక చేపట్టగా.. స్టాలిన్ ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. 70ఏళ్ల డీఎంకే చరిత్రలో స్టాలిన్ మూడో అధ్యక్షుడు. గత 50 ఏళ్లుగా కరుణానిధి అధ్యక్షుడిగా ఉండగా.. ఇప్పుడు స్టాలిన్ అధ్యక్ష పదవిని చేపట్టారు.

 పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో స్టాలిన్‌ను అధినేత‌గా ఎన్నుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. డీఎంకే పార్టీ ట్రెజ‌ర‌ర్‌గా దురై మురుగ‌న్‌ను ఎన్నుకున్నారు. ఇవాళ జ‌రిగిన‌ జనరల్ కౌన్సిల్ సమావేశంలో స్టాలిన్ ఎన్నిక‌పై నిర్ణయం తీసుకున్నారు. 14 ఏళ్ల వయసు నుంచే స్టాలిన్ పార్టీకి సేవలు అందించారు. దీంతో పార్టీలో స్టాలిన్‌కు ప్రత్యేక స్థానం కల్పించారు క‌రుణానిధి. మాజీ సోవియట్ యూనియన్ నేత అయిన జోసెఫ్ స్టాలిన్ పేరును స్పూర్తిగా తీసుకుని తన కుమారుడికి పెట్టుకున్నారు కరుణానిధి. మ‌రోవైపు పార్టీ చీఫ్ పదవి కోసం స్టాలిన్‌పై ఆయన సోదరుడు అళ‌గిరి తిరుగుబాటు ప్రకటించారు. ఇటీవ‌ల మాజీ సీఎం, డింఎకే చీఫ్ క‌రుణానిధి మ‌ర‌ణించ‌డంతో ఆ పార్టీ ప్రెసిడెంట్ స్థానానికి ఇవాళ ఎన్నిక నిర్వ‌హించారు. 

click me!