దారుణం: 44 మంది చిన్నారులపై లైంగిక దాడి, ఐదుగురి అరెస్ట్

Published : Aug 27, 2018, 06:28 PM ISTUpdated : Sep 09, 2018, 11:46 AM IST
దారుణం: 44 మంది చిన్నారులపై లైంగిక దాడి, ఐదుగురి అరెస్ట్

సారాంశం

తమిళనాడు రాష్ట్రంలోని అనాధ బాలికల ఆశ్రమంలో నిర్వాహకులు లైంగికదాడికి పాల్పడుతున్న విషయం వెలుగు చూసింది. ఈ ఆశ్రమాన్ని సోమవారంనాడు  జడ్జి తనిఖీ చేయడంతో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి.    


చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని అనాధ బాలికల ఆశ్రమంలో నిర్వాహకులు లైంగికదాడికి పాల్పడుతున్న విషయం వెలుగు చూసింది. ఈ ఆశ్రమాన్ని సోమవారంనాడు తనిఖీ చేసిన జడ్జికి దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి.  దీంతో  44 మంది బాలికలను  సురక్షిత ప్రాంతానికి తరలించారు.

తమిళనాడు  రాష్ట్రంలోని చెన్నైలోని సరస్వతి నగర్‌లో ఈ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో 5 నుండి 14 ఏళ్ల లోపు చిన్నారులు ఉన్నారు. సోమవారం నాడు ఈ ఆశ్రమాన్ని జడ్జిలు  తనిఖీ చేశారు.

జడ్జి తనిఖీతో  బాలికపై  లైంగిక దాడుల విషయం వెలుగు చూసింది. తమపై లైంగిక దాడికి సంబంధించి బాలికలు దారుణమైన విషయాలను బాలికలు బయటపెట్టారు. దీంతో  పోలీసులు ఈ ఆశ్రమంలో తనిఖీలు నిర్వహించారు.ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులతో పాటు   ఐదుగురిని అరెస్ట్ చేశారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్
Ration Card: భారీగా రేష‌న్ కార్డుల‌ను నిలిపివేయ‌నున్న ప్ర‌భుత్వం.. జాబితాలో మీది ఉందా.?