తండ్రిపై మైనర్ కొడుకు కాల్పులు.. పరిస్థితి విషమం.. అసలేం జరిగింది?

Published : Jul 31, 2023, 10:06 AM IST
తండ్రిపై మైనర్ కొడుకు కాల్పులు.. పరిస్థితి విషమం.. అసలేం జరిగింది?

సారాంశం

లూథియానా జిల్లా రాయికోట్‌లోని అకల్‌గఢ్ ఖుర్ద్ గ్రామానికి చెందిన దల్జీత్ సింగ్ అలియాస్ జీతాకు బుల్లెట్ తగలడంతో లూథియానాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు. అతనిపై తన మైనర్ కొడుకే కాల్పులు జరపడం గమనార్హం. 

పంజాబ్ లోని లూథియానాలో ఓ మైనర్ బాలుడు తన తండ్రిపై పిస్టల్ తో కాల్పులు జరిపింది. ప్రస్తుతం తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన తండ్రిని రాయకోట్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చిక్సిత కోసం అక్కడి నుంచి డీఎంసీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

వివరాల్లోకెళ్లే.. అకల్‌గఢ్ ఖుర్ద్ గ్రామానికి చెందిన దల్జీత్ సింగ్ తన భార్య, కొడుకుతో కలిసి బంధువును కలవడానికి కారులో వెళ్తున్నాడు.  ఆయన కారు డ్రైవింగ్ చేస్తుంటే.. తన కొడుకు వెనుక సీటులో కూర్చున్నాడు. కొద్దిదూరం చేరుకున్న తరువాత కారులో అకస్మాత్తుగా కాల్పుల శబ్దం వచ్చింది. దల్జీత్ సింగ్ వెనుక నుండి రక్తం కారుతోంది. రక్తాన్ని చూసిన తన భర్త, పిల్లలు ఒక్కసారిగా కేకలు వేశారు.

దీంతో చుట్టుపక్కల వారు తీవ్రంగా గాయపడిన దజ్లీత్ సింగ్‌ను మొదట రైకోట్ సివిల్ హాస్పిటల్ తరలించారు. ఆపై DMCకి రిఫర్ చేశారు. బుల్లెట్ అతని వీపులోంచి వెళ్లి పొట్టలోకి చేరుకుంది. వైద్యుల బృందం అతనికి ఆపరేషన్ చేసి బుల్లెట్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం అతని పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలియజేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ ఘటన ఆదివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని చౌకీ లోహత్‌బడ్డీ ఇన్‌చార్జి సుఖ్వీందర్ సింగ్ తెలిపారు.

సుఖ్వీందర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. పిస్టల్ లాక్ చేయబడిందా లేదా అనే విషయం ఇంకా తెలియరాలేదు. చిన్నారి చేతికి పిస్టల్ ఎలా వచ్చిందనేది అనుమానస్పదంగా ఉందనీ, ఈ విషయంలో బాధిత కుటుంబీకులు పోలీసులకు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు.  ప్రస్తుత అతని పరిస్థితి విషమంగా ఉందనీ, అతని ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే విచారణ చేపడుతామని తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. లైసెన్స్ పొందిన ఆయుధం నుండి అనుకోకుండా కాల్పులు జరిగాయి. 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !