లూథియానా కోర్టు పేలుళ్ల కుట్రదారు హర్‌ప్రీత్ సింగ్‌ అరెస్ట్....

Published : Dec 02, 2022, 11:08 AM IST
లూథియానా కోర్టు పేలుళ్ల కుట్రదారు హర్‌ప్రీత్ సింగ్‌ అరెస్ట్....

సారాంశం

లూథియానా కోర్టు పేలుడు నిందితుడు హర్‌ప్రీత్ సింగ్‌ను న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.

న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో లూథియానా కోర్టు పేలుళ్ల నిందితుడు హర్‌ప్రీత్ సింగ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. డిసెంబర్ 23, 2021న జరిగిన లూథియానా కోర్టు బాంబు పేలుడు ప్రధాన కుట్రదారుని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ  అరెస్టు చేసింది. 

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లాకు చెందిన హర్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ హ్యాపీ మలేషియా కౌలాలంపూర్‌ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుని అరెస్టు చేశారు. 2021లో లూథియానా కోర్టులో జరిగిన బాంబు పేలుడులో అరెస్టయ్యాడు. ఆ పేలుడులో ఒకరు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు.

పెళ్లిలో భోంచేశాడని, అంట్లు తోమించారు.. ఎంబీఏ విద్యార్థికి చేదు అనుభవం.. వీడియో వైరల్ అవ్వడంతో...

ఈ కేసు మొదట పీఎస్ డివిజన్-5, జిల్లా లూథియానా కమిషనరేట్, పంజాబ్‌లో నమోదయ్యింది. ఆ తరువాత జనవరి 2022లో ఎన్ఐఏ దీనిమీద తిరిగి కేసు రిజిస్టర్ చేసింది. లూథియానా కోర్టు పేలుళ్ల కుట్రదారుల్లోహర్‌ప్రీత్ సింగ్ ఒకరని ఇతను పాక్‌కు చెందిన స్వయం ప్రేరిత ఐఎస్‌వైఎఫ్ చీఫ్ లఖ్‌బీర్ సింగ్ రోడ్ సహచరుడని దర్యాప్తులో తేలింది. రోడ్ ఆదేశాల మేరకు, అతను లూథియానా కోర్ట్ కాంప్లెక్స్ పేలుడులో సహకరించాడు. దీనికోసం పాకిస్తాన్ నుండి వచ్చిన కస్టమ్-మేడ్ ఐఈడీని డెలివరీ తీసుకుని, భారతదేశానికి చెందిన అతని సహచరులకు అందేలా చేశాడని తేలింది. 

అరెస్టయిన నిందితుడికి పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌తో సహా పలు కేసుల్లో ప్రమేయం ఉంది. అంతకుముందు ఎన్ఐఏ హర్ ప్రీత్ సింగ్  మీద పది లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu