లక్నో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

By Siva KodatiFirst Published Mar 14, 2024, 9:17 PM IST
Highlights

1952లో నియోజకవర్గం ఏర్పడిన తొలినాళ్లలో కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలిచిన లక్నో.. తర్వాత బీజేపీకి పెట్టని కోటగా మారింది. విజయలక్ష్మీ పండిట్, షిరోజ్‌వతి నెహ్రూ, షీలా కౌల్, హేమంత్ నందన్ బహుగుణ, అటల్ బిహారీ వాజ్‌పేయ్, లాల్‌జీ టాంటన్, రాజ్‌నాథ్ సింగ్ వంటి వారు ఇక్కడి నుంచే లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయ్ 1991 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు లక్నో నుంచి ఎంపీగా గెలిచి బీజేపీకి గట్టి పునాది వేశారు. దీనిని ఇప్పుడు రాజ్‌నాథ్ సింగ్ కొనసాగిస్తున్నారు. 1991 నుంచి నేటి వరకు బీజేపీ లక్నోలో ఓడిపోకపోవడం ఆ పార్టీకి ఇక్కడున్న పట్టును అర్ధం చేసుకోవచ్చు. పూర్తిగా అర్బన్ ప్రాంతంలో లక్నో పార్లమెంట్ స్థానం విస్తరించి వుంది. ఓటర్లలో అత్యధికులు అగ్రవర్ణాలకు చెందినవారే. 2014, 2019లలో వరుసగా రెండు సార్లు లక్నో నుంచి గెలిచిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తున్నారు. 

లక్నో.. ఉత్తరప్రదేశ్ రాజధాని నగరం . నవాబుల నగరంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని 80 పార్లమెంట్ నియోజకవర్గాల్లో లక్నో అత్యంత కీలకమైనది. హేమాహేమీలు అనదగ్గ నేతలకు పుట్టినిల్లు. విజయలక్ష్మీ పండిట్, షిరోజ్‌వతి నెహ్రూ, షీలా కౌల్, హేమంత్ నందన్ బహుగుణ, అటల్ బిహారీ వాజ్‌పేయ్, లాల్‌జీ టాంటన్, రాజ్‌నాథ్ సింగ్ వంటి వారు ఇక్కడి నుంచే లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. 

లక్నో ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. ఉద్ధండులకు పుట్టినిల్లు :

1952లో నియోజకవర్గం ఏర్పడిన తొలినాళ్లలో కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలిచిన లక్నో.. తర్వాత బీజేపీకి పెట్టని కోటగా మారింది. 1990ల వరకు కాంగ్రెస్ హవా సాగినప్పటికీ.. 1991 నుంచి నేటి వరకు అక్కడ బీజేపీకి తప్పించి మరో పార్టీకి స్థానం లేదు. లక్నోలో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, బీజేపీ 8 సార్లు విజయం సాధించాయి. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయ్ 1991 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు లక్నో నుంచి ఎంపీగా గెలిచి బీజేపీకి గట్టి పునాది వేశారు. దీనిని ఇప్పుడు రాజ్‌నాథ్ సింగ్ కొనసాగిస్తున్నారు. 1991 నుంచి నేటి వరకు బీజేపీ లక్నోలో ఓడిపోకపోవడం ఆ పార్టీకి ఇక్కడున్న పట్టును అర్ధం చేసుకోవచ్చు. 

లక్నో ఎన్నికల ఫలితాలు 2024.. బ్రాహ్మణులదే ఆధిపత్యం :

లక్నో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో లక్నో వెస్ట్, లక్నో నార్త్, లక్నో ఈస్ట్, లక్నో సెంట్రల్, లక్నో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలున్నాయి. పూర్తిగా అర్బన్ ప్రాంతంలో లక్నో పార్లమెంట్ స్థానం విస్తరించి వుంది. ఓటర్లలో అత్యధికులు అగ్రవర్ణాలకు చెందినవారే. ముఖ్యంగా బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువ. ఇక్కడ షియా వర్గానికి చెందిన ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో వున్నారు. 

లక్నో ఎంపీ ( పార్లమెంట్ ) ఎన్నికల ఫలితాలు 2024 .. 1991 నుంచి ఓడిపోని బీజేపీ :

2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదు స్థానాల్లో బీజేపీ 3, సమాజ్‌వాదీ పార్టీ 2 స్థానాలను కైవసం చేసుకుంది. లక్నో లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 20,40,367 మంది. వీరిలో పురుషులు 9,43,815 మంది.. మహిళలు 10,96,455 మంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రాజ్‌నాథ్ సింగ్‌కు 6,33,026 ఓట్లు.. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధి పూనం సిన్హాకు 2,85,724 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్ధి ఆచార్య ప్రమోద్ కృష్ణమ్‌కు 1,80,111 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా రాజ్‌నాథ్ సింగ్ 3,47,302 ఓట్ల మెజారిటీతో లక్నోలో వరుసగా రెండోసారి విజయం సాధించారు. 

2014, 2019లలో వరుసగా రెండు సార్లు లక్నో నుంచి గెలిచిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తున్నారు. పలు సర్వేలలో ఓటర్లు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తేలింది. మోడీ ఛరిష్మా, కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులు, రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దూకుడు తదితర అంశాలతో తన విజయం ఖాయమని రాజ్‌నాథ్ ధీమాగా వున్నారు. ఇక ఇండియా కూటమి నుంచి సమాజ్‌వాదీ పార్టీ రవిదాస్ మెహ్రోత్రాను బరిలో దించింది. ఆయన ప్రస్తుతం లక్నో సెంట్రల్ నుంచి ఉత్తరప్రదేశ్ శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

click me!