సామాన్యులకు గ్యాస్ షాక్... పెరిగిన సిలిండర్ ధర

By telugu teamFirst Published Sep 2, 2019, 8:31 AM IST
Highlights

నెలరోజుల క్రితం వంటగ్యాస్‌ ధర తగ్గిందని సంతోషించినా నెలతిరిగే సరికి మళ్లీ ధర పెంచేశారు. నెలరోజులకోసారి ధరల సమీక్ష జరుగుతుంది. తాజాగా ఆదివారం జరిగిన సమీక్ష అనంతరం లిక్విడ్‌పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పిజి) సిలిండర్‌ధర 16 రూపాయలు పెరిగినట్టు ప్రభుత్వ రంగ రిటైల్‌సంస్థలు ప్రకటించాయి.

సామాన్యులు, మధ్యతరగతి కుటుంబసభ్యులకు ఊహించని షాక్ తగిలింది. వంట గ్యాస్ ధర మళ్లీ పెరిగింది. నెలరోజుల క్రితం వంటగ్యాస్‌ ధర తగ్గిందని సంతోషించినా నెలతిరిగే సరికి మళ్లీ ధర పెంచేశారు. నెలరోజులకోసారి ధరల సమీక్ష జరుగుతుంది. తాజాగా ఆదివారం జరిగిన సమీక్ష అనంతరం లిక్విడ్‌పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పిజి) సిలిండర్‌ధర 16 రూపాయలు పెరిగినట్టు ప్రభుత్వ రంగ రిటైల్‌సంస్థలు ప్రకటించాయి.

 ప్రస్తుతం సిలిండర్‌ధర 628 రూపాయలుఉండగా పెరిగినధరలో 644 రూపాయలకుచేరింది. కాగా ఢిల్లీలో మాత్రం సిలిండర్‌పై 15.50 రూపాయలు పెరిగినట్టుతెలిపారు. ప్రతినెలా 1వతేదీన ఆయిల్‌కంపెనీలు ఎల్‌పిజి ధరల సై సమీక్ష నిర్శహిస్తున్నాయి. 

ఈసారి అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌పై రూపాయి మారకం తగ్గడం, ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లనే ధర పెంచాల్సి వచ్చిందని ఆయిల్‌ కంపెనీలు వెల్లడించాయి.కాగా పెరిగిన ధర ఆదివారం నుంచే అమలులోకి వస్తుందని ప్రకటించాయి.
 

click me!