కరోనా:లాక్‌డౌన్ ఎత్తివేతపై ఐసీఎంఆర్ రాష్ట్రాలకు కీలక సూచనలు

Published : Jun 02, 2021, 01:19 PM IST
కరోనా:లాక్‌డౌన్ ఎత్తివేతపై ఐసీఎంఆర్ రాష్ట్రాలకు కీలక సూచనలు

సారాంశం

కరోనా అన్‌లాక్ విషయంలో ఐసీఎంఆర్ రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ  మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. 

న్యూఢిల్లీ: కరోనా అన్‌లాక్ విషయంలో ఐసీఎంఆర్ రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ  మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. తక్కువ పాజిటివిటీ రేటు, అత్యధిక మందికి టీకాలు, కోవిడ్  ప్రోటోకాల్స్ నిబంధనలతో కూడిన ప్రవర్తన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. 

 ప్రతివారం కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉండి కరోనా ముప్పు అధికంగా ఉన్న 70 శాతం వర్గాలకు వ్యాక్సిన్ వేస్తే అన్ లాక్ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చన్నారు. అంతేకాదు  ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. జిల్లా స్థాయిల్లో కంటోన్మెంట్ లను ఏర్పాటు చేయడంతో పాటు పరీక్షలను పెంచడం వల్ల ఇది సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. 

జూలై మధ్య వారం నుండి ఆగష్టు మొదటి వారం నాటికి దేశంలో రోజూ కోటి మందికి వ్యాక్సిన్ అందిస్తామని ఆయన ఆయన చెప్పారు.దేశం మొత్తానికి నెల రోజుల వ్యవధిలో టీకాలు వేయలేమన్నారు.టీకాలకు కొరత లేదన్నారు. అయితే వ్యాక్సిన్ అందరూ వేసుకోనేందుకు వీలుగా ఉత్పత్తి కూడ పెంచాలని ఫార్మా కంపెనీలను ప్రభుత్వం ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !