దారుణం : నడుస్తున్న రైలులో మహిళపై అత్యాచారంయత్నం, గొంతుకోసి హత్య.. !

Published : Jun 02, 2021, 10:59 AM IST
దారుణం : నడుస్తున్న రైలులో మహిళపై అత్యాచారంయత్నం, గొంతుకోసి హత్య.. !

సారాంశం

మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. నడుస్తున్న రైలులో 21 యేళ్ల యువతి మీద అత్యాచారయత్నం చేసి, గొంతుకోసి చంపి పడేసిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సెహోర్ లో జరిగింది. 

మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. నడుస్తున్న రైలులో 21 యేళ్ల యువతి మీద అత్యాచారయత్నం చేసి, గొంతుకోసి చంపి పడేసిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సెహోర్ లో జరిగింది. 

ఇండోర్-బిలాస్ పూర్ రైలులో నుంచి సెహోర్ రైల్వే స్టేషన్ సమీపంలో యువతి మృతదేహాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని జిల్లా సీనియర్ పోలీసు అధికారి ఎస్ఎస్ చౌహాన్ చెప్పారు. 

రైలులో ఒక మహిళ తమ వైపు పరుగెత్తుకు రావడం చూశామని ప్రయాణికులు చెప్పారు. ఇండోర్-బిలాస్ పూర్ రైలు స్లీపర్ కోచ్ లో ప్రయాణిస్తున్న తన సోదరిని కొంతమంది లైంగికంగా వేధించారని, దీంతో డయల్ 100కు ఫోన్ చేసి చెప్పానని మృతురాలి సోదరుడు చెప్పారు. 

బాధిత యువతి గొంతుకోసి నిందితులు పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families
తమిళనాడులో విద్యుత్ బస్ స్టేషన్ లను పరిశీలించిన సీఎం విజయ్ | CM Vijay Inspects EV MTC Bus Depo