ప్రయాణికుల ముక్కు, చెవుల్లో నుంచి రక్తం..వెనుతిరిగిన విమానం

By ramya neerukondaFirst Published Sep 20, 2018, 10:08 AM IST
Highlights

విమానంలోని ప్రయాణికులంతా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. కొందరి ముక్కులు, చెవుళ్లో నుంచి రక్తం కారుతోంది. ఇంకొంతమందైతే తలనొప్పి బరించలేకపోయారు. 

విమానంలోని ప్రయాణికులంతా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. కొందరి ముక్కులు, చెవుళ్లో నుంచి రక్తం కారుతోంది. ఇంకొంతమందైతే తలనొప్పి బరించలేకపోయారు. దీంతో.. అప్రమత్తమైన పైలెట్ వెంటనే విమానాన్ని వెనక్కి తప్పేశారు. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గురువారం ఉదయం జెట్ ఎయిర్ వేస్ విమానయాన సంస్థకు చెందిన ఓ విమానం ముంబయి నుంచి జయపురకి బయలుదేరింది. విమానం బయలుదేరిన కొద్ది సేపటికే ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. విమాన లో క్యాబిన్ ప్రెషర్ కారణంగా ప్రయాణికులకు ఇలా జరిగిందని అధికారులు తెలిపారు.

 విమానం టేక్ ఆఫ్ అయ్యే ముందు క్యాబిన్ ప్రెషర్ ని మెయిన్ టెయిన్ చేసే స్విచ్ఛ్ ని ఆన్ చేయడం పైలెట్ మర్చిపోయాడు. దీంతో.. లో ప్రెషర్ ఎక్కువై ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ సమయంలో విమానంలో 30మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

విమానాన్ని పైలెట్ మళ్లీ వెనక్కి తిప్పడంతో.. వారందరూ సురక్షితంగా ముంబయి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులోనే ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అందరికీ ఆరోగ్యం కుదుటుగానే ఉందని జెట్ ఎయిర్ వేస్ తెలిపింది. 
 

click me!