గాయపడిన పాముకు చికిత్స.. ఎంఆర్ఐ, సీటీ స్కాన్

Published : Sep 20, 2018, 08:20 AM IST
గాయపడిన పాముకు చికిత్స.. ఎంఆర్ఐ, సీటీ స్కాన్

సారాంశం

పాము కనిపిస్తేనే చాలు దానిని చంపేవరకు వదిలిపెట్టం.. అలాంటిది ఒక పాము గాయపడిందని దానికి చికిత్స చేయడం ఎప్పుడైనా విన్నామా..? కానీ గాయపడిన ఒక పాముకు చికిత్స చేసి దాని ప్రాణాలు నిలబెట్టి గొప్ప మనసు చాటుకుంది ఒక లేడీ డాక్టర్

పాము కనిపిస్తేనే చాలు దానిని చంపేవరకు వదిలిపెట్టం.. అలాంటిది ఒక పాము గాయపడిందని దానికి చికిత్స చేయడం ఎప్పుడైనా విన్నామా..? కానీ గాయపడిన ఒక పాముకు చికిత్స చేసి దాని ప్రాణాలు నిలబెట్టి గొప్ప మనసు చాటుకుంది ఒక లేడీ డాక్టర్.

ముంబై దహిసర్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి ఆకుపచ్చ రంగున్న అరుదైన సర్పం ప్రవేశించింది.. అది ఎక్కడ కాటు వేస్తుందోనని భయపడిన ఆ ఇంటి కుటుంబసభ్యుడు దాన్ని చంపేందుకు కర్రతో కొట్టాడు.. దీంతో దాని వెన్నెముక విరిగి గాయపడింది.

పాములను సంరక్షించే వైభవ్ పాటిల్‌కు విషయం తెలియడంతో దానికి చికిత్స అందించాలని నిర్ణయించాడు. వాలంటీర్‌గా ఉన్న లేడీ డాక్టర్ దీపా కత్యాల్‌ గాయపడిన పామును ఆసుపత్రికి తీసుకెళ్లి దానిని ఎంఆర్ఐ స్కాన్, సీటీ స్కాన్ చేయించగా.. వెన్నెముక విరిగిందని నిర్థారణ అయ్యింది. వెంటనే దానికి చికిత్సను ప్రారంభించిన దీప.. కోల్ లేజర్ చికిత్సతో పాటు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ఇచ్చారు. దీప చికిత్సతో పాము ఇప్పుడిప్పుడే మెల్ల మెల్లగా కోలుకుంటోంది.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌