పట్టపగలు నడిరోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట.. బైక్‌పై రొమాన్స్‌.. వీడియో వైరల్

By Mahesh K  |  First Published Apr 23, 2022, 4:12 PM IST

కర్ణాటకలో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. పట్టపగలే నడిరోడ్డుపై బైక్‌పై రొమాన్స్ చేసుకున్నారు. రోడ్డుపై సాధారణ ప్రయాణికులు వెళ్తున్నా వారు అదేమీ పట్టించుకోకుండా రొమాన్స్‌లో మునిగిపోయారు. ఒకరు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
 


బెంగళూరు: ఒకప్పుడు ప్రేమికులు ప్రైవసీ ఎక్కువగా కోరుకునేవారు. బహిరంగంగా కనీసం మాట్లాడుకోవడానికీ కూడా వెనుకాముందు ఆడేవారు. తర్వాత ఈ బిడియం తగ్గుముఖం పట్టింది. నేరుగా చెట్టాపట్టాల్ వేసుకునే తిరిగే వరకు అయితే అందరూ చూశారు. కానీ, అంతకు మించి అన్నట్టుగా పట్టపగలు నడిరోడ్డుపై బైక్ పై రొమాన్స్ చేసుకోవడం బహుశా సినిమాల్లోనే చూసి ఉంటారు. కానీ, కర్ణాటకలో ఓ జంట సినిమాలతో ప్రభావితమైందో.. మరే ఇతర కారణాలు వారిని ప్రేరేపించాయో గానీ, ఏకంగా నడి రోడ్డుపై పట్టపగలు బైక్‌పై రొమాన్స్ చేస్తూ చక్కర్లు కొట్టింది. 

కర్ణాటకలోకి చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట ప్రధాన రహదారిపై ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. పబ్లిక్‌గా.. ఆ మాటకు వస్తే.. నడిరోడ్డుపై బైక్‌పై రొమాన్స్ చేసుకుంటూ వెళ్లారు. పల్సర్ బైక్‌పై ఆ జంట పరస్పరం ముద్దుల వర్షం గుప్పించుకున్నారు. ఆ ప్రియుడు బైక్ రైడ్ చేస్తూ ఉంటే.. ప్రేయసి బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై ఆయనకు ఎదురుగా కూర్చుంది. ఆమె రెండు కాళ్లను ఆ యువకుడి చుట్టూ పెనవేసుకుని ప్రియుడిపై ముద్దులు కురిపించింది. ప్రియుడు కూడా బైక్ నడుపుతూనే ఆమెను ముద్దాడాడు.

Latest Videos

ఎదురుగా కార్లు, బస్సులు, లారీలు వస్తున్నా లెక్క చేయకుండా.. చుట్టూ ఉన్నవారూ వారిని అబ్జర్వ్ చేస్తున్నారన్న విషయాన్నీ కూడా వారు ఖాతరు చేయలేదు. నలుగురు నవ్విపోదురుగాక అన్నట్టుగా లోకం ఏమనుకుంటే తమకేం అనే రీతిలో ప్రవర్తించారు. ఆ ప్రేమ జంటో మరో లోకంలో విహరిస్తున్నట్టుగానే బిహేవ్ చేశారు.

The on running bike, video is quite . police arrested bike rider.
The police released the girl sitting with the young man with a warning. pic.twitter.com/WrvYOHn5z4

— Dhakad India (@dhakadndia)

ఈ జంట అలా రోడ్డుపై హద్దు మీరి ప్రవర్తిస్తుండగా ఒకరు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో నెట్టింట్లో ఆ వీడియో తెగ వైరల్ అయిపోయింది. చాలా మంది వారిపై విమర్శలు గుప్పించారు. నిస్సిగ్గుగా పబ్లిక్‌గా అలా న్యూసెన్స్ చేయడం సరికాదని పేర్కొన్నారు. కలికాలం బాబోయ్ అంటూ మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, ఇంకొందరు మరో అర్జున్ రెడ్డి అంటూ సినిమాను గుర్తు చేశారు.

చివరకు ఈ వీడియో పోలీసులకూ చేరింది. బైక్‌పై కేసు నమోదు చేసినట్టు చామరాజనగర్ డీఎస్పీ వివరించారు. పోలీసులు సదరు యువకుడిని అరెస్టు చేసినట్టు తెలిసింది. కాగా, ఆ యువతిని వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టినట్టు ఓ యూజర్ సమాచారం ఇచ్చాడు.

click me!