పెళ్లైన నెలకే..ప్రియుడితో కలిసి నవవధువు ఆత్మహత్య..

Published : Jul 20, 2022, 11:45 AM IST
పెళ్లైన నెలకే..ప్రియుడితో కలిసి నవవధువు ఆత్మహత్య..

సారాంశం

కర్ణాటకలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోకుండా.. బలవంతంగా వేరే వ్యక్తితో పెళ్లి చేయడంలో ఈ దారుణానికి ఒడి గట్టారు. 

కర్ణాటక : తమ ప్రేమను పెద్దలు భగ్నం చేశారని మనస్తాపం చెందిన ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాప్రయత్నం చేసింది. వీరిద్దరు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. ఉత్తర కన్నడ జిల్లా హళియాళలో ఈ విషాద ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెడితే..హళియాళకు చెందిన జ్యోతి అంత్రోళకర (19), రికేష్ సురేష్ మిరాశి (20)లు హళియాళ డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. కాలేజీలో పెరిగిన పరిచయంతో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. 

కాగా, నెల రోజుల కిందట తల్లిదండ్రులు జ్యోతికి మరో యువకునితో వివాహం చేశారు. అయితే, పెళ్లి అయినప్పుటికీ ప్రియుడిని జ్యోతి మరిచిపోలేదు. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన ప్రేమికులు.. తాము ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 15వ తేదీన ముందగోడు రోడ్డులో ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగారు. స్థానికులు గమనించి ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్చారు. నాలుగు రోజులపాటు చావు బతుకుల మధ్య పోరాడి మంగళవారం వీరు మరణించారు. ఈ మేరకు హళియాళ పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇదిలా ఉండగా, మే 23న ఇలాంటి విషాద ఘటనే ఉడిపిలో జరిగింది. తమ ప్రేమను ఇరు కుటుంబాలు వ్యతిరేకించడంతో తాము ప్రయాణించిన కారుపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని యువతీ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఉడిపి జిల్లా బ్రహ్వార తాలూకా హెగ్గుంజె గ్రామ సమీపంలో కారు దహనమవుతుండటాన్ని చూసిన స్థానికులు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే యువతీ యువకులు అగ్నికి ఆహుతయ్యారు. బెంగుళూరుకు చెందిన యశ్వంత్, జ్యోతి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

ఈ నేపథ్యంలో జ్యోతి, యశ్వంత్ శనివారం రాత్రి మంగళూరు చేరుకున్నారు. అక్కడే ఓ కారును అద్దెకు తీసుకుని ఉడిపివైపుకు పయనమయ్యారు. అంతకు ముందే ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాన్ని కుటుంబపెద్దలకు తెలిపినట్లు సమాచారం. వారు అప్రమత్తం అయ్యేలోపే ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కారుపై పెట్రోల్ పోసుకుని లోపల కూర్చుని నిప్పంటించుకున్నారు. బ్రహ్మావర  పోలీసులు కేసు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, జూన్ 28న ఇలాంటి మరో ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ఓ గ్రామంలోని గౌసియాహ్వా పోఖ్రే సమీపంలో చెట్టుకు ఉరి వేసుకున్న పదహారేళ్ల బాలిక, 17 ఏళ్ల బాలుడి మృతదేహాలు కనిపించాయని పోలీసు అధికారి తెలిపారు. ఈ జంట మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టంకు తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం చెలరేగింది. ఈ ఇద్దరు మైనర్లు ఒకే తరగతి లో చదువుకుంటున్నారు. వారిద్దరూ ఏడాదిగా ప్రేమించుకున్నారు. 

ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం వీరిద్దరూ కలిసి ఒకే చోట కనిపించడంతో బాలిక కుటుంబ సభ్యులు ఆ బాలికను అమ్మమ్మ గ్రామానికి పంపించారు. ఆదివారం వీరిద్దరూ కలుసుకున్నారు. ఆ తరువాత వీరి మృతదేహాలు కనిపించాయి.  మృతులు మైనర్ లేనని పోలీస్ అధికారి అంబికారామ్ తెలిపారు. అమ్మాయికి పదహారేళ్లు, అబ్బాయికి పదిహేడేళ్ల అని తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పోస్టుమార్టం కోసం తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు