ప్రేయసి కోసం బుర్కా వేసుకున్న ప్రియుడు... కట్ చేస్తే..అతడికి జరిగింది తెలిస్తే షాక్...

Published : Aug 19, 2022, 10:45 AM IST
ప్రేయసి కోసం బుర్కా వేసుకున్న ప్రియుడు... కట్ చేస్తే..అతడికి జరిగింది తెలిస్తే షాక్...

సారాంశం

ప్రేయసికోసం సాహసాలు చేస్తుంటారు చాలామంది. అలాంటి సాహసమే చేశాడో ప్రియుడు కానీ.. చివరికి జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే... 

ఉత్తరప్రదేశ్ : ‘నిన్ను ఒకసారి చూడాలి అనిపిస్తుంది’.. అంటూ అతడు తన ప్రేయసికి మెసేజ్ చేశాడు. దీంతో అతని బాధను అర్థం చేసుకొని ఆ యువతి తన బుర్రకు పదును పెట్టింది. ‘బుర్కా వేసుకుని మా ఇంటికి వచ్చేసేయ్’ అని మెసేజ్ పెట్టింది. దీంతో అతడు ఎగిరి గంతేశాడు. ఆమె చెప్పిన మాటలను తు.చ తప్పకుండా పాటించాడు. బుర్కా వేసుకున్నాడు.  అయితే అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి అన్నట్టుగా..  కథ అడ్డం తిరిగింది. చివరికి అతనికి ఏ గతి పట్టిందని విషయం తెలియాలంటే పూర్తి వివరాలు లోకి వెళ్లాల్సిందే..

ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ కు చెందిన సైఫ్ అలీ అనే యువకుడికి ప్రస్తుతం 25 ఏళ్లు. కొన్నేళ్లుగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఆమె కూడా అతడిని ఇష్టపడుతుండడంతో ఇద్దరూ అప్పుడప్పుడు కలిసేవారు. సరదాగా మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే సైఫ్ అలీకి ఉద్యోగం వచ్చింది. దీంతో అతడు వేరే ప్రాంతానికి వెళ్లి కొన్ని రోజుల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రియురాలిని ఒకసారి చూసి ప్రయాణానికి సిద్ధం అవ్వాలని అతడు భావించాడు.

ముగ్గురు పిల్లల్ని, భర్తను వదిలేసి ప్రియుడితో భార్య జంప్.. వీడియో కాల్స్ చేసి హింస.. తట్టుకోలేక ఆ భర్త చేసిన పని..

రెగ్యులర్ గా కలిసే ప్రాంతానికి రావాల్సిందిగా ఆమెను కోరాడు. అయితే ఆమె అందుకు నిరాకరించింది. అంతేకాకుండా ప్రియుడు బాధను అర్థం చేసుకుంది. తనకు కూడా కలవాలని ఉందని కాకపోతే వీలు కావడం లేదని దీనికోసం ఓ సలహా ఇచ్చింది. ఎవరూ గుర్తుపట్టకుండా బురఖా ధరించి తన ఇంటికి రావాల్సిందిగా సూచించింది. దీంతో సైఫ్ అలీ ఎగిరి గంతేశాడు. యువతి చెప్పినట్టే బుర్కా వేసుకుని ఆమె ఇంటి పరిసర ప్రాంతాలకు చేరుకున్నాడు. అయితే అతడి కదలికలను చూసి అనుమానం వ్యక్తం చేసిన స్థానికులు.. అతడిని బుర్కా తీయాల్సిందిగా బెదిరించారు. 

కాసేపు వారి బెదిరింపులకు, డిమాండ్లకు లొంగని సైఫ్ అలీ చివరికి చేసేదేమీలేక బుర్ఖా తీసేయాల్సి వచ్చింది. ఆడవాళ్ళ వేసుకునే బుర్కా వేసుకుని వచ్చిన సైఫ్ అలీని చూసి వారంతా ఒక్కసారిగా షాకయ్యారు.  వెంటనే అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని అరెస్టు చేశారు. శాంతికి భంగం కలిగించిన నేరం కింద అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంతో ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu