లవ్ జిహాద్‌ను సహించేది లేదు.. కేసులు పెరుగుతుండ‌టంపై ఉత్తరాఖండ్ సీఎం వార్నింగ్..

Published : Jun 10, 2023, 10:57 AM IST
లవ్ జిహాద్‌ను సహించేది లేదు.. కేసులు పెరుగుతుండ‌టంపై ఉత్తరాఖండ్ సీఎం  వార్నింగ్..

సారాంశం

Dehradun: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై లవ్ జిహాద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉత్తరాఖండ్ లో వివిధ మతాల ప్రజలు శాంతియుతంగా క‌లిసి జీవిస్తున్నార‌ని చెప్పారు. ఇలాంటి వాతావ‌ర‌ణంలో లవ్ జిహాద్ వంటి వాటిని సహించేది లేదన్నారు. కుట్రలో భాగంగానే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారన్నారు.  

Love jihad cases-Uttarakhand: ఇటీవ‌లి కాలంలో భార‌త్ లో ల‌వ్ జిహాద్ అంశం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ క్ర‌మంలోనే ప‌లు రాష్ట్రాలు దీనిని అరిక‌ట్ట‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగా చ‌ట్టాలు సైతం తీసుకువ‌చ్చాయి. తాజాగా ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం ల‌వ్ జిహాద్ గురించి హెచ్చ‌రించింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై లవ్ జిహాద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉత్తరాఖండ్ లో వివిధ మతాల ప్రజలు శాంతియుతంగా క‌లిసి జీవిస్తున్నార‌ని చెప్పారు. ఇలాంటి వాతావ‌ర‌ణంలో లవ్ జిహాద్ వంటి వాటిని సహించేది లేదన్నారు. కుట్రలో భాగంగానే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారన్నారు.

"ఉత్తరాఖండ్ లో వివిధ మతాల ప్రజలు శాంతియుతంగా జీవనం సాగిస్తున్నారు. అయితే లవ్ జిహాద్ వంటి వాటిని సహించేది లేదు. కుట్రలో భాగంగానే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ప్రజలు బహిరంగంగానే వారికి వ్యతిరేకంగా ముందుకు వస్తున్నారు' అని పుష్క‌ర్ సింగ్ ధామీ మీడియాతో అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల వెలుగుచూసిన 'లవ్ జిహాద్' ఘటనలకు సంబంధించి తీసుకున్న చర్యలపై పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన అనంత‌రం ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. గత కొన్ని వారాలుగా ఉత్తరకాశీ, చమోలీ, హరిద్వార్ జిల్లాల్లో మైనర్ హిందూ బాలికలను ముస్లిం యువకులు అపహరించడానికి తమ మత గుర్తింపును దాచిపెట్టి అపహరించడానికి ప్రయత్నించిన సంఘటనలు దాదాపు అరడజనుకు పైగా నమోదయ్యాయ‌ని తెలిపారు.

లవ్ జిహాద్ కేసుల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం పుష్కర్ సింగ్ ధామి రాష్ట్ర డీజీపీ, శాంతిభద్రతల అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీపీ) వి.మురుగేశన్ ను ఆదేశించారు. గత 12 రోజుల్లో కనీసం నాలుగు 'లవ్ జిహాద్' ఘటనలు చోటుచేసుకోవడంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మత ఘర్షణలు కొనసాగుతున్నాయి. గత నెలల 'లవ్ జిహాద్' కేసులను ప‌రిశీలించాల‌ని డీజీపీని ఆదేశించారు. ఉత్తరాఖండ్ లో వివిధ వ‌ర్గాలు ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారని, కానీ ఇక్కడ ఇలాంటి నేరాలను సహిస్తామని దీని అర్థం కాదన్నారు. గత రెండు నెలలుగా ఇలాంటి కేసుల సంఖ్య పెరిగింది. ప్రజలు ఇప్పుడు దాని గురించి తెలుసుకుని దానిని నివారించడానికి ముందుకు వస్తున్నార‌న్నారు. 

'లవ్ జిహాద్' అనేది ఒక ప్రణాళికాబద్ధ వ్యూహంగా జరుగుతోందని తాము భావిస్తున్నామని సీఎం అన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటికే కఠినమైన మతమార్పిడి నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టిందని, ఇలాంటి నేరాలను నిరోధించడానికి సాధ్యమైన అన్ని చర్యలను కొనసాగిస్తుందన్నారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌