లవ్ జిహాద్ ఇస్లాం మతాన్నే అప్రతిష్టపాలు చేస్తున్నది.. బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు

Published : Jun 17, 2023, 09:10 PM IST
లవ్ జిహాద్ ఇస్లాం మతాన్నే అప్రతిష్టపాలు చేస్తున్నది.. బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

లవ్ జిహాద్ ఇస్లాం మతాన్ని, ముస్లిం సమాజాన్ని మొత్తంగా అప్రతిష్టపాలు చేస్తున్నదని బాబా రాందేవ్ అన్నారు. కాబట్టి, ముస్లింలు లవ్ జిహాదీలను వ్యతిరేకించాలని కోరారు.  

న్యూఢిల్లీ: యోగా గురువు రాందేవ్ బాబా లవ్ జిహాద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మత మార్పిళ్లు, లవ్ జిహాద్ వంటి సున్నితమైన అంశాలపై ఆయన అభిప్రాయాలు తెలిపారు. 

మత మార్పిడి గురించి మీ అభిప్రాయం ఏమిటీ? అని ప్రశ్నించగా.. మత మార్పిడి మంచి విషయం కాదని అన్నారు. ఏ నాగరిక సమాజంలోనైనా ప్రజలు వారి ఆలోచనలను మార్చుకోవచ్చు, జీవితాలను మార్చుకోవచ్చు, జీవన ప్రమాణాలను మెరుగపరుచుకోవచ్చు అని వివరించారు. వీటిని మనం అర్థం చేసుకోగలమని చెప్పారు. కానీ, మోసపూరితంగా, బలవంతంగా, కుట్ర పన్ని లేదా రాజకీయ ఎజెండా కోసం మత మార్పిళ్లకు పాల్పడటం కచ్చితంగా తప్పు అని అన్నారు.

లవ్ జిహాద్ పైనా అభిప్రాయాన్ని అడగ్గా.. మతం గురించి తాను ఒక విషయం చెబుతానని అన్నారు. స్వధర్మ నిష్ట, పర ధర్మ సహిష్ణుత అని చెప్పారు. స్వధర్మం గురించి నిష్టగా ఉండాలని, ఇతర ధర్మాలను గౌరవించాలని వివరించారు. 

Also Read: Adipurush: డైలాగ్‌లు హిందువుల మనోభావాలను గాయపరిచాయి: సినిమాను సమర్థించిన బీజేపీ నేతలపై ఆప్ ఫైర్

లవ్ జిహాద్ దేశమంతటా జరుగుతున్నదని అన్నారు. ఇది వాస్తవం అని తెలిపారు. లవ్ జిహాద్‌లకు పాల్పడు తున్న వారు ఇస్లాంను, ముస్లిం సమాజాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని అన్నారు. అందుకే ముస్లింలు ఈ లవ్ జిహాదీలను వ్యతిరేకించాలని కోరారు. అసలు ఇస్లాంలో లవ్ జిహాద్ అనేదే లేదని తన తో అన్నారని వివరించారు.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !