కదులుతున్న బైక్‌పై ప్రేమ జంట రొమాన్స్.. వీడియో వైరల్.. పోలీసులేం చేశారంటే...(వీడియో)

By SumaBala Bukka  |  First Published Jun 23, 2023, 7:18 AM IST

ఘజియాబాద్‌లో కదులుతున్న బైక్‌పై ఓ జంట రొమాన్స్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో పోస్ట్ అయిన సెకన్లలో వైరల్‌గా మారింది. 


ఉత్తరప్రదేశ్ : బహిరంగ ప్రదేశాల్లో రొమాన్స్ చేస్తున్న జంటల సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఇది చెప్పగానే ఢిల్లీ మెట్రో గుర్తుకు వస్తుందా? అయితే, ఇప్పుడు చెప్పుకోబోయేది.. దాని గురించి కాదు.. ఉత్తరప్రదేశ్ లోని ఓ బైకర్ గురించి... బైక్ నడుపుతూ ప్రియురాలిని హత్తుకుని...జాతీయ రహదారిమీద హల్ చల్ చేసిందో జంట. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

ఘజియాబాద్‌లో కదులుతున్న బైక్‌పై ఓ జంట ప్రేమలో మునిగితేలుతున్న ఓ వీడియో ఇంటర్నెట్‌లో కనిపించి క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటనను ఘజియాబాద్‌లోని ఎన్ హెచ్ 9లో ఒక ప్రయాణీకుడు రికార్డ్ చేశాడు. వైరల్ వీడియోలో, యువకుడు బైక్ ట్యాంక్‌పై అమ్మాయిని కూర్చో బెట్టుకోగా.. ఆమె అతడిని హత్తుకుని కూర్చుంది. వారిద్దరూ బైక్‌పై విన్యాసాలు చేస్తున్నారు. అదే సమయంలో అటుగా.. అదే హైవేపై ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు ఈ వీడియో తీశాడు.

Latest Videos

undefined

పురుషుడిగా మారనున్న బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య కూతురు...

సంబంధిత ఫుటేజీని ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. ఘజియాబాద్ పోలీసులను కూడా ట్వీట్‌లో ట్యాగ్ చేశారు. వీడియోలో వీరిద్దరి ముఖాలు కనిపించనప్పటికీ, పోలీసులు వారిని ట్రాక్ చేయగలిగారు. దీనికి సంబంధించి చలాన్ జారీ చేశారు. ఈ ట్వీట్‌పై ఆ శాఖ కూడా స్పందించింది.

ఈ సంఘటనతో ప్రజలు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువకులు ఇలాంటి విన్యాసాలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని, ఇలాంటి ఉదంతాలను కఠినంగా శిక్షించాలని అంటున్నారు.

ఇదిలా ఉండగా మేలో, బైక్ నడుపుతున్న వ్యక్తి, పిలియన్ కూర్చున్న మహిళ దాదాపు ఇలాంటి స్టంట్ చేసిన ఇలాంటి సంఘటన వైరల్ అయ్యింది. మహిళ వెనుక నుండి వ్యక్తిని కౌగిలించుకుంది.  అతను కూడా ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు. రద్దీగా ఉండే రోడ్డుపై బైక్ మీద కూర్చున్నప్పుడు ఇది జరిగింది.
 

 

में आशिक मिजाज बाइक सवार की वीडियो हुई वायरल इंदिरापुरम के NH 9 का बताया जा रहा है ।

वो कहते है ना -
"हम तो मरेंगे सनम तुम्हे साथ लेके मरेंगे "
पर
नियम कानून ताक पर रख के ही सफर करेंगे । pic.twitter.com/xPmSgzbfmO

— Akash Kumar (@Akashkchoudhary)
click me!