
పశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని 'సుచేతన్'గా మారాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఆమె న్యాయ సలహా తీసుకుంటోంది. ఈ ప్రక్రియకు అవసరమైన అన్ని ధృవపత్రాల కోసం సైకోథెరపిస్ట్ లను సంప్రదించింది.
ఇటీవల ఎల్‌జిబిటిక్యూ వర్క్‌షాప్‌కు హాజరైన సుచేతన, తనను తాను పురుషుడిగా గుర్తించానని అన్నారు. అందుకే మానసికంగానే కాకుండా.. శారీరకంగా కూడా అలాగే ఉండాలనుకుంటున్నానని చెప్పింది. సుచేతన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ “నా తల్లిదండ్రుల గుర్తింపు లేదా కుటుంబ గుర్తింపు పెద్ద విషయం కాదు. నా LGBTQ ఉద్యమంలో భాగంగా నేను దీన్ని చేస్తున్నాను. ట్రాన్స్‌మ్యాన్‌గా నేను ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సామాజిక వేధింపులను ఆపాలనుకుంటున్నాను."
" ప్రపంచంలోని అన్ని విశ్వాసాలకు భారతదేశం నిలయం": భారతీయ వైవిధ్యంపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
"నేను పెద్దదాన్ని. ఇప్పుడు నా వయసు 41. నా జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను నేనే తీసుకోగలను. అలాగే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. దయచేసి నా తల్లిదండ్రులను ఇందులోకి లాగవద్దు. మానసికంగా తనని తాను పురుషుడిగా భావించేవారు పురుషులు. అలాగే నేనూ నన్ను నేను మానసికంగా మగాడిగా అనుకుంటాను. అందుకే ఇప్పుడు శారీరకంగా కూడా మగాడిలా మారాలని కోరుకుంటున్నాను”ఆమె చెప్పారు.
ఈ నిర్ణయం తన చిన్నతనం నుంచి తన తండ్రికి తెలుసు కాబట్టి.. ఈ నిర్ణయానికి తన తండ్రి మద్దతిస్తాడని సుచేతన భావిస్తోంది. “నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. దీనికోసం నేను పోరాడతాను. నాకు ఆ ధైర్యం ఉంది. ఎవరు ఏం చెప్పినా పట్టించుకోను. అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను'' అని సుచేతన తెలిపింది.
అంతేకాదు.. ఈ వార్తలను వక్రీకరించవద్దని సుచేతన మీడియాకు విజ్ఞప్తి చేసింది. “ఇది నా ఒక్కదాని నిర్ణయం. ఈ వార్తలను వక్రీకరించవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది నా స్వంత పోరాటం. నేను ఒంటరిగా పోరాడాలనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం కావడం మంచిది కాదు. నా చిన్నప్పటి నుండి నాది ఇదే ధోరణి. దీనికి చాలా మంది మద్దతివ్వగా, కొంత మంది విస్తుపోయారు. మానసికంగా, నేను ట్రాన్స్-మ్యాన్ ను.. శారీరకంగా, నేను అలాగే ఉండాలనుకుంటున్నాను.
LGBTQ కమ్యూనిటీ బోల్డ్ గా ఉండాలని కూడా ఆమె కోరింది. “నేను అందరినీ బోల్డ్ గా ఉండాలని అడుగుతున్నాను. బహుశా నా పేరు, నా తల్లిదండ్రుల మీద వివాదం రావచ్చు. కానీ నేను పదే పదే చెబుతాను, దయచేసి అర్థం చేసుకోండి. అది ప్రతి ఒక్కరికీ అవసరం” అన్నారు.