
లక్నో: యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ మంగళవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి. 112 నెంబర్‌కు కాల్ చేసి, అలాగే, ఆ నెంబర్ వాట్సాప్‌కూ మెస్సేజీతో యూపీ సీఎం యోగిని టార్గెట్ చేశారు. త్వరలోనే సీఎం యోగిని చంపేస్తా అంటూ బెదిరింపులు చేశారు. ఈ బెదిరింపులు రాగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఫోన్ ఓనర్‌ను కనుగొని పట్టుకున్నారు. దీంతో ఈ బెదిరింపుల్లో లవ్ యాంగిల్ ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది.
ఆ ఫోన్ ఓనర్‌ను బెదిరింపుల గురించి ప్రశ్నించగా.. తన ఫోన్ రెండు రోజుల క్రితం పోయిందని పోలీసులకు తెలిపాడు. స్థానికులు కీలక విషయాలు వెల్లడించారు. ఒక తప్పుడు కేసులో గర్ల్‌ఫ్రెండ్ తండ్రిని ఇరికించాలనే లక్ష్యంగా ఈ బెదిరింపులు చేసినట్టు తెలిపారు.
18 ఏళ్ల అమీన్.. సాజద్ హుస్సేన్ కూతురిని ప్రేమిస్తున్నాడు. కానీ, వీరి రిలేషన్‌ను హుస్సేన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. దీంతో హుస్సేన్ ప్రవర్తనపై అమీన్‌కు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎలాగైనా తన గర్ల్‌ఫ్రెండ్ తండ్రికి తిప్పలు పెట్టాలని అనుకున్నాడు. సాజద్ హుస్సేన్ ఫోన్ దొంగిలించి ఆ ఫోన్ ద్వారానే సీఎం యోగికి బెదిరింపులు చేశాడు.
Also Read: హైదరాబాద్‌ను వణికించిన భారీ వర్షం.. హుస్సేన్ సాగర్‌లో కొట్టుకుపోయిన బోటు, అందులో 40 మంది
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ చోరీతోపాటు ఇతర కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం నిందితుడిని లక్నో కోర్టు ఎదుట హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు.