మహారాష్ట్ర సర్కార్ మెలిక... ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన వాయిదా

By Siva KodatiFirst Published Aug 18, 2022, 9:14 PM IST
Highlights

ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. ఈ నెల 21న ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని మరో చోట కేటాయిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో శంకుస్థాపనను రద్దు చేసింది టీటీడీ. 
 

ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. ఈ నెల 21న ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. చివరి నిమిషంలో ఆలయ శంకుస్థాపన రద్దు చేసింది టీటీడీ. ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని మరో చోట కేటాయిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో శంకుస్థాపనను రద్దు చేసింది టీటీడీ. 

కాగా.. నవీ ముంబైలోని ఉల్వేలో భగవాన్ బాలాజీ కా మందిర్ భూమి పూజను షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 21న నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానించారు. ఇకపోతే.. శ్రీవారి ఆలయం నిర్మాణానికి రూ.200 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఆలయాన్ని నిర్మించడానికి అయ్యే వ్యయాన్ని తాను భరిస్తానని రేమండ్ సంస్థ అధినేత గౌతమ్ సింఘానియా భరిస్తానని స్పష్టం చేసిన సంగతి తెలిసిదే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయింతో భూమి పూజ కార్యక్రమం వాయిదాపడింది. 
 

click me!