చిల్లర కేసు.. ఎస్‌బీఐలో రూ. 11 కోట్ల చిల్లర మిస్సింగ్.. సీబీఐ తనిఖీలు

By Mahesh KFirst Published Aug 18, 2022, 7:37 PM IST
Highlights

రాజస్తాన్‌లోని ఓ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో రూ. 11 కోట్ల చిల్లర కాయిన్స్ కనిపించకుండా పోయాయి. దీంతో అధికారులు ఆందోళనలో పడ్డారు. రాజస్తాన్ హైకోర్టు మేరకు కేసు రిజిస్టర్ చేసిన సీబీఐ 25 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది.
 

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చిల్లర సమస్య వచ్చి పడింది. అంటే.. చిల్లర లేదని కాదు.. మిస్ అయినందుకు వచ్చిన సమస్య. చిల్లరే కదా.. అని కొట్టి పారేసేలా లేదు. ఎందుకంటే.. అది ఏకంగా రూ. 11 కోట్ల విలువ చేసే కాయిన్స్ కనిపించకుండా పోవడం ఇప్పుడు ఎస్‌బీఐని వేధిస్తున్న సమస్యగా మారింది. చిల్లర కాయిన్స్ కనిపించకపోవడంపై కేసు నమోదైంది. ప్రస్తుతం సీబీఐ తనిఖీలు చేస్తున్నది.

రాజస్తాన్‌లోని కరౌలీలో ఎస్‌బీఐ బ్రాంచీ ఉన్నది. ఈ బ్రాంచీ వాల్ట్స్ నుంచి రూ. 11 కోట్ల కాయిన్స్ మిస్ అయ్యాయి. దీనిపై రాజస్తాన్ హైకోర్టు సీరియస్ అయింది. కేసు నమోదు చేసుకోవాలని ఆదేశించింది. దీంతో సీబీఐ ఏప్రిల్ 13వ తేదీన కేసు నమోదు చేసింది. అనంతరం, 25 లొకేషన్‌లలో సీబీఐ సెర్చెస్ చేపట్టింది. ఢిల్లీ, దౌసా, కరౌలీ, సవాయి మాధోపూర్, అల్వార్, ఉదయిపూర్, భిల్వారాలలో తనిఖీలు చేపట్టింది. అలాగే, ఈ బ్యాంకులో ఉద్యోగం చేసిన మాజీ ఉద్యోగులకు చెందిన సుమారు 15 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది.

2021 ఆగస్టులో ఎస్‌బీఐ చిల్లర మిస్ అయినట్టు అనుమానం వచ్చింది. దీంతో ఓ ప్రాథమిక ఎంక్వైరీ చేపట్టింది. ఈ ఎంక్వైరీ తర్వాత అనుమానాలు ఇంకా బలపడ్డాయి. దీంతో ఈ చిల్లర లెక్కింపును ప్రారంభించింది. ఔట్ సోర్సింగ్ ద్వారాఓ ప్రైవేటు వెండర్‌‌కు ఈ పని అప్పగించారు. ఈ లెక్కింపులో కరౌలీ ఎస్‌బీఐ బ్రాంచీ నుంచి సుమారు రూ. 11 కోట్ల కాయిన్స్ మిస్ అయినట్టు తేలింది.

click me!