లోక్ సభ బరిలో తెలంగాణ గవర్నర్ తమిళిసై?.. ఈసారైనా కలనెరవేరేనా?

By SumaBala Bukka  |  First Published Dec 26, 2023, 1:41 PM IST

తమిళనాడులోని సౌత్ చెన్నై లేదా తిరునల్వేలి నుంచి తమిళి సై సౌందర్యరాజన్ ఈసారి లోక్ సభకు పోటీ చేయాలని రెడీ అవుతున్నట్లుగా సమాచారం.


హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ఎంపీగా మారబోతున్నారా? అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం లోక్సభ ఎన్నికలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు రావచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు సిద్ధంగా ఉండాలని అన్ని పార్టీలు తమ నేతలకు కార్యకర్తలకు చెబుతున్నాయి. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశాయి. 

ఈ నేపథ్యంలోనే తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళిసై సౌందర్య రాజన్ కూడా ఈ లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడులోని సౌత్ చెన్నై లేదా తిరునల్వేలి నుంచి తమిళి సై సౌందర్యరాజన్ ఈసారి లోక్ సభకు పోటీ చేయాలని రెడీ అవుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే గవర్నర్ మంగళవారం ఢిల్లీకి వెళ్ళనున్నారు. హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయి తన ఎంపీ అభ్యర్థిత్వంపై మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. 

Latest Videos

ఉస్మానియాలో రోగి మృతి: మృతిడికి కోవిడ్ పాజిటివ్

తమిళిసై సౌందర్య రాజన్ ఇలా ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగడం ఇది మొదటిసారి ఏమి కాదు. 2009లో చెన్నై నార్త్ నుంచి, 2019లో తూర్పు నుంచి ఎంపీగా పోటీ చేశారు. కానీ గెలవలేదు. ఎంపీగానే కాదు మరో మూడుసార్లు అసెంబ్లీకి కూడా పోటీ చేశారు. అయినా కూడా ఆమె  గెలుపును చూడలేకపోయారు. 2019లో బిజెపి ప్రభుత్వం పార్టీకి తమిళిసై చేసిన సేవలను గుర్తించి తెలంగాణ గవర్నర్ గా నియమించారు. ఆ తర్వాత 2021లో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.

ఇప్పటికీ ఆమె కల ఫలించిఎంపిగా పోటీ చేసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షాలు గ్రీన్ సిగ్నల్ కనక ఇస్తే.. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త మార్పు రాబోతుంది. ఒకవేళ ప్రత్యక్ష ఎన్నికల్లో సౌందర్య రాజన్ పోటీ చేయాల్సి వస్తే రాజ్యాంగబద్ధమైన పదవిని వదిలేయాల్సి ఉంటుంది. అప్పుడు వచ్చేనెలలో  తెలంగాణకు కొత్త గవర్నర్ ను నియమించాల్సి ఉంటుంది. తన పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గంలో కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచి విస్తృతంగా పర్యటించాలని తమిళిసై సౌందర్యరాజన్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 

గవర్నర్ నిర్ణయంతో ఇప్పుడు తెలంగాణకు వచ్చే కొత్త గవర్నర్ ఎవరు అనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు మళ్లీ రాష్ట్రానికి కొత్తగా గవర్నర్ ను నియమించాల్సి వస్తే అది రిటైర్డ్ ఆఫీసర్ కు అవకాశం ఇస్తారా? లేక  రాజకీయ నాయకులనే  నియమిస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

click me!