"ఆరు రోజులు బ్యాంకులకు సెలవులు".. నమ్మకండి అది గాలివార్తే

By sivanagaprasad KodatiFirst Published Aug 31, 2018, 12:11 PM IST
Highlights

సెప్టెంబర్ మొదటివారంలో బ్యాంకులకు వరుసగా ఆరు రోజుల పాటు మూతపడనున్నాయని.. నగదును జాగ్రత్త చేసుకోవాలంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తల్లోనిజం లేదని తేలింది.

సెప్టెంబర్ మొదటివారంలో బ్యాంకులకు వరుసగా ఆరు రోజుల పాటు మూతపడనున్నాయని.. నగదును జాగ్రత్త చేసుకోవాలంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తల్లోనిజం లేదని తేలింది. ఈ వార్తలపై జాతీయ బ్యాంక్ ఉద్యోగుల సంఘం నేతలు స్పందించారు. బ్యాంకులు ఆరు రోజుల పాటు మూత పడనున్నాయనే వార్తల్లో నిజం లేదని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని వారు స్పష్టం చేశారు.

బ్యాంకింత్ నిబంధనల ప్రకారం వరుసగా 3 రోజులకు మించి సెలవులు ఉండవని... ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడుతుందని.. బ్యాంకింగ్ వ్యవస్థ స్తంభించిపోతుందన్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. సెప్టెంబర్ 2 ఆదివారం సెలవు, 3 శ్రీకృష్ణ జన్మాష్టమి.. ఆ తరువాత 4, 5 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె అని.. 8, 9 తేదీల్లో రెండవ శనివారం, ఆదివారం కావడంతో వరుస మెసేజ్‌లు షేర్ అవుతున్నాయి..

అయితే జన్మాష్టమి కొన్ని రాష్ట్రాల్లో ఐచ్చిక సెలవేనని.. 4, 5 తేదీల్లో సమ్మె చేపట్టనుంది కేవలం రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగులు మాత్రమేనని.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయని... బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు రాణా తెలిపారు. 

click me!