
జమ్మూ కాశ్మీర్‌లో విషాదం జరిగింది. పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) సమీపంలో ఆదివారం అర్థరాత్రి ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలింది. దీంతో విధుల్లో ఉన్న భారత ఆర్మీ కెప్టెన్, జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) మరణించారు. మృతులను కెప్టెన్ ఆనంద్, నాయబ్ సుబేదార్ భగవాన్ సింగ్‌గా గుర్తించారు. వీరిద్దరు పూంచ్‌లోని మెంధార్ సెక్టార్‌లో పెట్రోలింగ్ పార్టీలో భాగంగా ఉన్నారు.
‘‘ జూలై 17వ తేదీ రాత్రి పూంచ్ జిల్లాలోని మెంధార్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి సైనికులు విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలింది ’’ అని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే వీరికి గాయాలు అయిన వెంటనే హెలికాప్టర్‌లో ఉదంపూర్ కమాండ్ ఆసుపత్రికి తరలించారు. కానీ వీరు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు.
కాగా మెంధార్ సెక్టార్‌ను ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. జూలై 6వ తేదీన పూంచ్ జిల్లాలోని ఝూలా వద్ద నియంత్రణ రేఖ వెంబడి భేరా ప్రాంతంలో రాకెట్ లాంచర్ ఎక్సర్ సైజ్ నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు.
Justice for Srimathi : తమిళనాడు బాలిక అనుమానాస్పద మృతి కేసులో ఇద్దరు టీచర్లు అరెస్ట్..
ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలోని గంగూ క్రాసింగ్ సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద పోలీసులు, CRPF సిబ్బందిపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ వినోద్ కుమార్ గాయపడ్డారు. ఆయనను పుల్వామాలోని హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. ఈ దాడి వెంటనే భద్రతా దళాలు మొత్తం ఘటనా ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆపరేషన్ కొనసాగించారు.