లోక్‌పాల్ లోగో.. నినాదం ఇదే

By sivanagaprasad KodatiFirst Published Nov 26, 2019, 4:55 PM IST
Highlights

పార్లమెంట్ సభ్యులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులపై వచ్చే అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన లోక్‌పాల్‌కు కేంద్రప్రభుత్వం లోగో, నినాదాన్ని ఎంపిక చేసింది

పార్లమెంట్ సభ్యులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులపై వచ్చే అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన లోక్‌పాల్‌కు కేంద్రప్రభుత్వం లోగో, నినాదాన్ని ఎంపిక చేసింది.

ఇందుకోసం కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఇటీవల ఓ పోటీ నిర్వహించింది. ఇందులో సుమారు 6 వేల మందికి పైగా పాల్గొని లోగో డిజైన్లు, నినాదాలు పంపారు. వీటిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ప్రశాంత్ మిశ్రా రూపొందించిన డిజైన్, నినాదాన్ని అధికారులు ఎంపిక చేశారు.

Also read:సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా: ఫడ్నవీస్

‘‘లోక్‌పాల్ ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తుంది... ఎలా న్యాయం చేస్తుంది‘‘ అనేది ప్రతిబింబించేలా ఈ లోగోను అతను రూపొందించాడు. పౌర జనాన్ని సూచించేలా ముగ్గురు వ్యక్తులు, త్రివర్ణ పతాకంలోని అశోక చక్రం, భారత న్యాయ వ్యవస్థను ప్రతిబింబించేలా కాషాయ రంగులో పుస్తకం, ఆ పుస్తకాన్ని రెండు చేతుల్లో పట్టుకున్నట్లుగా లోగోను తయారు చేశారు.

మొత్తం 2,236 మంది లోగో డిజైన్లు పంపగా... ప్రశాంత్‌ను విజేతగా ప్రకటించారు. అలాగే 4,705 మంది నినాదాలు పంపగా.. వీటిలో ఏ ఒక్కటి సంతృప్తికరంగా లేకపోవడంతో ఎవరిని ఎంపిక చేయలేదని సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించింది.

Also Read:Maharashtra update:అజిత్ పవార్ రాజీనామా: చక్రం తిప్పిన శరద్ పవార్ భార్య

దీంతో ‘‘ ఇతరుల సంపద పట్ల ఆశపడొద్దు’’ అంటూ ఈశోపనిషత్‌లో ఉన్న వ్యాఖ్యలను లోక్‌పాల్ కమిటీతో చర్చించి నినాదంగా తీసుకున్నారు. కాగా... లోగో విజేతకు రూ.25 వేల నగదు బహుమతిని ప్రకటించారు.  

click me!