లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా: ఎయిమ్స్ లో చికిత్స

Published : Mar 21, 2021, 02:46 PM ISTUpdated : Mar 21, 2021, 02:50 PM IST
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా: ఎయిమ్స్ లో చికిత్స

సారాంశం

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా సోకింది. దీబతో ఆయన కరోనా చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు.ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

న్యూఢిల్లీ:లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా సోకింది. దీబతో ఆయన కరోనా చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు.ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

శనివారం నాడు ఆయన ఎయిమ్స్ లో చేరారు. ఎయిమ్స్ వైద్యులు పరీక్షించిన తర్వాత ఆయనకు కరోనా వచ్చినట్టుగా తేల్చారు.దేశంలో కరోనా కేసులు కూడ ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల ఉధృతిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడ మరింత వేగవంతం చేయనుంది కేంద్రం,. దేశంలో మహారాష్ట్ర, కేరళలలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో లాక్‌డౌన్ విధించారు. కొన్ని చోట్ల రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం