Lok Sabha Election: 2019లో మార్చి 10న షెడ్యూల్ ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్ మే నెలలోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తోంది.
Lok Sabha Election: సార్వత్రిక ఎన్నికల సమరానికి భారత్ సిద్దమవుతోంది. పార్లమెంట్ ఎన్నికల తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. లోకసభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు రచిస్తుంది. ఇప్పటికే ఈసీ పలు రాష్ట్రాల్లో పర్యటన చేసింది.
ఈ సమయంలో రాజకీయ పార్టీలతో సమావేశమయ్యింది. అలాగే.. స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన ఎన్నికల సంఘం..ఆయా అధికారులను ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితోపాటు జమ్మూ కాశ్మీర్లోను అసెంబ్లీ ఎన్నికల నిర్వహించాలని ఈసీ భావిస్తోంది.
ఇందుకోసం మార్చి 8 , 9 తేదీలు కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎన్నికల సంఘం బృందం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులు బలగాలపై ఆ సమావేశంలో కీలకంగా ప్రస్తవించనుంది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహించే అవకాశాలపై ఒక అంచనాకు రానున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాతే జమ్మూ కాశ్మీ ర్లో ఈసీ బృందం పర్యటన ఉంటుందని తెలుస్తోంది.
అంటే.. మార్చి 12, 13వ తేదీల్లో ఈసీ బృందం జమ్మూ కాశ్మీర్లో పర్యటించి క్షేత్రస్థాయిలోని పరిస్థితుల్ని పరిశీలించనున్నది. లోక్సభ తో పాటు జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహించే అవకాశాలపై ఒక అంచనాకు రానున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో 2019లో మాదిరిగానే ఈ సారి ఎన్నికల షెడ్యూల్ ఉండవచ్చని భావిస్తున్నారు. 2019 ఎన్నికలకు ఆ ఏడాది మార్చి 10న ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు పోలింగ్ నిర్వహించారు. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్- మే నెలలోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తోంది.