ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు: లోక్‌సభ నిరవధిక వాయిదా

Published : Mar 25, 2021, 02:20 PM IST
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు: లోక్‌సభ నిరవధిక వాయిదా

సారాంశం

పార్లమెంట్  గురువారం నాడు నిరవధికంగా వాయిదా పడింది. రెండు నెలల సుదీర్ఘ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టితో ముగిశాయి.  

న్యూఢిల్లీ: పార్లమెంట్  గురువారం నాడు నిరవధికంగా వాయిదా పడింది. రెండు నెలల సుదీర్ఘ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టితో ముగిశాయి.ఈ ఏడాది జనవరి 29న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీ వరకు  జరగాలి. కానీ, నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి.

దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి.దీంతో పార్లమెంట్ సమావేశాలను త్వరగా ముగించాలని పలువురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ను కోరారు.కరోనా సోకడంతో స్పీకర్ ఓం బిర్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.స్పీకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.మరోవైపు రాజ్యసభ కూడ ఇవాళ సాయంత్రం నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉంది.

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడ ఈ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం