అక్రమ సంబంధాలు తేలుతాయి: 225 మంది ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టిన మంత్రి

By narsimha lodeFirst Published Mar 25, 2021, 11:58 AM IST
Highlights


బెంగుళూరు: కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.రాష్ట్ర అసెంబ్లీ ఉన్న 225 మంది ఎమ్మెల్యేలు ఎంతమందితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నారో తెలుసుకొనేందుకు దర్యాప్తు చేయాలని చేసిన ప్రకటన రాజకీయంగా సంచలనాన్ని సృష్టించింది. 

బెంగుళూరు: కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.రాష్ట్ర అసెంబ్లీ ఉన్న 225 మంది ఎమ్మెల్యేలు ఎంతమందితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నారో తెలుసుకొనేందుకు దర్యాప్తు చేయాలని చేసిన ప్రకటన రాజకీయంగా సంచలనాన్ని సృష్టించింది. మంత్రి ప్రకటన పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చింది. ఈ ప్రకటనపై మంత్రి ఆ తర్వాత వివరణ ఇచ్చారు.

తన ప్రకటనను తప్పుగా అన్వయించారని ఆయన విచారం వ్యక్తం చేశారు.కాంగ్రెస్, జేడీ(ఎస్)కు చెందిన విపక్ష ఎమ్మెల్యేలు తమను శ్రీరామచంద్రులుగా, మర్యాద పురుషులుగా చెప్పుకొంటున్నారన్నారు. వారికి తాను ఒక సవాల్ విసురుతున్నట్టుగా చెబుతున్నారు.తనతో సహా అసెంబ్లీలోని 225 మంది ఎమ్మెల్యేలకు ఉన్న వివాహేతర సంబంధాలు ఉన్నాయో లేవో తేల్చుకొనేందుకు దర్యాప్తును ఎదుర్కోవాలన్నారు.

బెంగుళూరులో ఆయన మీడియాతో మాట్లారు. ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం తెలుసునని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంంలో ఎవరు ఏమి చేశారో తెలుసునన్నారు. ఇది నైతికత, విలువల ప్రశ్న అని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడ ఇందులో పాల్గొనాలని ఆయన చెప్పారు.

అసెంబ్లీలో విపక్ష నాయకుడు సిద్దరామయ్య, కర్ణాటక పీసీసీ చీఫ్ డికె శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పేర్లను తీసుకొని వారి మనస్సాక్షి సరైందైతే ఈ ప్రతిపాదనకు అంగీకరించి విచారణకు ముందుకు రావాలని ఆయన కోరారు.

తనతో పాటు ఆరుగురు మంత్రులు రాజీనామా చేయాలని కోరిన విషయమై ఆయన స్పందించారు. కర్ణాటక ఆరోగ్య మంత్రితో పాటు కార్మిక మంత్రి శివరామ్ హెబ్బర్, వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్, సహకార శాఖ మంత్రి సోమశేఖర్, యువ సాధికారిత, క్రీడా మంత్రి నారాయణ గౌడ, పట్టణాభివృద్ది శాఖ మంత్రి భీరతి బసవరాజ్ పై విపక్షాలు ఆరోపణలు చేశాయి.

ఈ నెల ప్రారంభంంలో మంత్రి రమేష్ జార్కిహోలి రాజీనామా చేశారు. యువతితో రాసలీలల్లో మంత్రి ఉన్నాడనే వీడియోలు బయటకు రావడంతో ఆయన రాజీనామా చేశారు. ఈ వీడియోలు నకిలీవని మాజీ మంత్రి రమేష్ ఆరోపించిన విషయం తెలిసిందే.

 మంత్రి సుధాకర్ ప్రకటనపై పీసీసీ చీఫ్ డికె శివకుమార్ స్పందించారు. తనకు భార్య, ఒక కుటుంబం ఉందన్నారు. తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆయన చెప్పారు. ఈ విషయమై పార్టీలో చర్చించిన తర్వాత అసెంబ్లీలో చర్చిస్తామన్నారు.

ఇలాంటి విషయాలు బహిరంగంగా చర్చింకూడదని మాజీ సీఎం కుమారస్వామి చెప్పారు. సత్య హరిశ్చంద్ర అని ఎవరూ కూడ చెప్పుకోలేరన్నారు.బీజేపీకి చెందిన షోరాపూర్ ఎమ్మెల్యే నరసింహనాయక్ మంత్రి సుధాకర్ ను డిమాండ్ చేశారు. ఈ ప్రకటన తప్పు అని ఆయన చెప్పారు.మంత్రి తాను ప్రకటన చేసేముందు నిర్ధిష్టంగా పేర్లను ప్రకటించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందరిని ఒకే రకంగా చూడడం సరైంది కాదన్నారు.

అసెంబ్లీలో 225 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇది మా గౌరవానికి సంబంధించిన విషయమని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్ వీ దేశ్ పాండే అభిప్రాయపడ్డారు. తాను 30 నుండి 32 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని ఆయన గుర్తు చేశారు.

మంత్రి సుధాకర్ ప్రకటనపై విపక్ష నేత సిద్దరామయ్య స్పందించారు. రమేష్ కుమార్, కుమారస్వామిలతో కలిసి తన పేరును ప్రత్యేకంగా తీసుకొన్నారని ఇది సభ అధికారాన్ని ఉల్లంఘించినట్టేనని  సిద్దరామయ్య చెప్పారు.మొత్తం 225 మంది ఎమ్మెల్యేలను విచారించాలని తాను సీఎం ను కోరుతున్నానని ఆయన చెప్పారు. మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మంత్రి సుధాకర్ అసెంబ్లీ వెలుపల మీడియా ముందు చేశారని దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అసెంబ్లీ వ్యవహరాల శాఖ మంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు.మంత్రి ప్రకటనపై స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్గే కాగెరి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.  

తన ప్రకటనపై స్వంత పార్టీ నుండే విమర్శలు రావడంతో మరునాడు మంత్రి సుధాకర్ సభలో ప్రకటన చేశారు. తనకు ఎమ్మెల్యేలంటే అసెంబ్లీ అంటే గౌరవమని ఆయన చెప్పారు. తాను ఎవరిని అగౌరవపర్చేలా మాట్లాడలేదన్నారు.విపక్ష నాయకుల ప్రకటనకు వ్యతిరేకంగా తాను మాట్లాడిన మాటలు తప్పుగా అన్వయించబడినట్టుగా ఆయన చెప్పారు.
 

click me!