కరోనాలో ఇండియా రికార్డు: 24 గంటల్లో 4 లక్షలు దాటిన కేసులు, 4 వేల మంది మృతి

By narsimha lodeFirst Published May 6, 2021, 9:25 AM IST
Highlights

దేశంలో కరోనా కేసులు 4 లక్షలు దాటాయి. 4 లక్షలు కరోనా కేసులు దాటడం దేశంలో ఇది రెండోసారి. గత ఏడాది కరోనా జూన్ 22వ తేదీన  4 లక్షల కేసులు నమోదయ్యాయి.
 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు 4 లక్షలు దాటాయి. 4 లక్షలు కరోనా కేసులు దాటడం దేశంలో ఇది రెండోసారి. గత ఏడాది కరోనా జూన్ 22వ తేదీన  4 లక్షల కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో 4,12,262 మందికి కరోనా సోకింది. 24 గంటల్లో కరోనాతో 3980 మంది మరణించారు.ఒక్క రోజులోనే  కరోనా నుండి 3,29,113 మంది మరణించారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,10,77,410కి చేరుకొంది. ఇప్పటివరకు 2,30,168 మంది మరణించారు.ఇప్పటివరకు 1,72,80,844 మంది కోలుకొన్నారు. దేశంలో ఇప్పటివరకు 16,25,13,339 మంది వ్యాక్సినేషన్ చేయించుకొన్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలోని మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదౌతున్నాయి. 20 శాతానికి పైగా పాజిటివిటీ గల రాష్ట్రాల్లో  13వ స్థానంలో ఏపీ రాస్ట్రం నిలిచింది.  దేశంలో కరోనా కేసులు 4 లక్షలు దాటడం ఈ ఏడాది ఇదే ప్రథమం.  కరోనాతో  దేశంలో 4 వేల మంది మరణించారు. మహారాష్ట్రలో ఒక్క రోజులోనే 50 వేలు కేసులు దాటాయి. కేరళ రాష్ట్రంలో ఒక్క రోజులోనే  40 వేలు దాటాయి.

కర్ణాటక రాష్ట్రంలో కూడ కరోనా కేసులు భారీగా నమోదౌతున్నాయి. బెంగుళూరు నగరంలో ఒక్క రోజులోనే 234 వేల కేసులు  రికార్డయ్యాయి. దేశంలో కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. మరోవైపు వ్యాక్సినేషన్ కు వీలుగా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాలని  కేంద్రం ఫార్మా కంపెనీలను కోరింది. ఈ నెల 1వ తేదీ నుండి 18 ఏళ్లు నిండినవారికి కూడ వ్యాక్సినేషన్‌కి కేంద్రం అనుమతి ఇచ్చింది. 

click me!