బీజేపీ అగ్రనేత అద్వానీకి భారతరత్న.. శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ ట్వీట్...

Published : Feb 03, 2024, 11:44 AM ISTUpdated : Feb 03, 2024, 11:59 AM IST
బీజేపీ అగ్రనేత అద్వానీకి భారతరత్న.. శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ ట్వీట్...

సారాంశం

ఎల్‌కే అద్వానీజీకి భారతరత్న ఇవ్వబడుతుందని తెలపడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించాను అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 

బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ .కే అద్వానీకి భారతరత్న ప్రకటించారు. దీనిమీద ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత ఉపప్రధానిగా, బీజేపీ సీనియర్ నేతగా ఆయన సేవలను ప్రధాని ప్రశంసించారు. దేశాభివృద్ధిలో అద్వానీ పోషించిన పాత్ర కీలకం అంటూ ప్రశంసించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో తామిద్దరి ఫొటోలు షేర్ చేశారు. ఆయన ఏమన్నారంటే.. 

‘ఎల్‌కే అద్వానీజీకి భారతరత్న ఇస్తున్నామని తెలపడం చాలా సంతోషంగా ఉంది. వెంటనే నేను ఆయనతో ఈ విషయాన్ని మాట్లాడి అభినందనలు తెలిపాను. మన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో ఎల్ కే అద్వానీ ఒకరు, భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి స్మరణీయమైనది. అట్టడుగు స్థాయిలో పనిచేయడం నుంచి దేశ ఉప ప్రధానమంత్రిగా సేవలందించడం వరకు ఆయన కృషి ఎంచదగినది. అద్వానీ హోం మంత్రిగా, I&B మంత్రిగా సేవలందించారు’ అని పేర్కొన్నారు. 

 

 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం