
పాకిస్థాన్ లో బతకడం అంటే నరకంలో ఉండటంతో సమానం అని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సైమన్ డౌల్ అన్నారు. అక్కడ చాలా రోజులు ఆహారం లేకుండా గడిపానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభానికి ముందు పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) కామెంటరీ విధుల కోసం డౌల్ పాకిస్తాన్ కు వెళ్లారు. అయితే ఆ సమయంలో తాను ఎన్నో కష్టాలు పడ్డానని ఆయన గుర్తు చేసుకున్నారు.
యూపీలో మరో ఎన్ కౌంటర్.. అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ హతం.. పోలీసులను ప్రశంసించిన యోగి
పీఎస్ ఎల్ - 2023లో సైమన్ డౌల్ కామెంటరీ చేస్తున్న సమయంలో క్రికెటర్ బాబర్ అజామ్ విధానాన్ని ప్రశ్నించాడు. క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన రికార్డ్-బ్రేకింగ్ గేమ్ సమయంలో.. పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజం తన తొలి సెంచరీని కొట్టాడు. బాబర్ ఓ దశలో 46 బంతుల్లో 83 పరుగులు చేసి, వందకు చేరుకోవడానికి మరో 14 బంతులు తీసుకున్నాడు. ఈ సమయంలో వ్యాఖ్యతగా ఉన్న డౌల్.. బాబర్ స్వార్థ విధానాన్ని ప్రశ్నించేలా చేసింది. బాబర్ సొంత రికార్డు కోసం బాల్స్ ను తీసుకున్నాడని, జట్టు కోసం కష్టపడాలని ఆయన సూచించారు.
ఆయన వ్యాఖ్యల పట్ల బాబర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై బెదిరింపులకు దిగారు. దీంతో ఆయన బయటకు ఎక్కడికీ వెళ్లలేదు. ప్రస్తుతం ఇండియాలో డౌల్ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ‘‘పాకిస్థాన్ లో బతకడం అంటే జైల్లో బతకడం లాంటిదే. బాబర్ అజామ్ అభిమానులు నా కోసం ఎదురుచూస్తుండటంతో నన్ను బయటకు వెళ్లనివ్వలేదు. నేను చాలా రోజులు ఆహారం లేకుండా ఉన్నాను. నన్ను కూడా మానసికంగా హింసించారు, కానీ దేవుడి దయ వల్ల నేను ఎలాగోలా తప్పించుకున్నాను’’ అని ఆయన ‘జియో న్యూస్’తో అన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీని వీడిన మరో ఎమ్మెల్యే కుమారస్వామి
సైమన్ డౌల్ ఒక ప్రసిద్ధ వ్యాఖ్యాత. ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన గొంతులలో ఒకరుగా ఉన్నారు. న్యూజిలాండ్ మాజీ పేసర్ అయిన ఆయన.. విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండటంపై వ్యాఖ్యానించి గతంలో వార్తల్లో నిలిచాడు. ‘‘42 నుంచి 50 పరుగులకు 10 బంతులు తీసుకున్నాడు. తన వ్యక్తిగత మైలురాళ్ల గురించి ఆందోళన చెందుతున్నారు. ఇకపై ఈ మ్యాచ్ లో దానికి చోటు లేదని భావిస్తున్నా’’ అని లక్నో సూపర్ జెయింట్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ మ్యాచ్ లో అన్నారు. ఏప్రిల్ 14 నుంచి మే 7 వరకు న్యూజిలాండ్ తో పాకిస్థాన్ 3 టీ20లు, 5 వన్డేలు ఆడనుండగా.. డౌల్ ఐపీఎల్ కోసం భారత్ లోనే ఉండనున్నారు.