బలవంతంగా రెండో పెళ్లి.. భర్తకు రాఖీ కట్టిన భార్య..!

Published : Jun 13, 2023, 10:45 AM IST
బలవంతంగా రెండో పెళ్లి.. భర్తకు రాఖీ కట్టిన భార్య..!

సారాంశం

కూతురికి తమ కులానికి చెందిన ఛత్తీస్ గఢ్ లోని అంతఘర్ పట్టణానికి చెందిన మరో వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేశాడు. నిజానికి, ఆమెకు ముందే పెళ్లి జరిగిందనే విషయం ఆ వరుడు కుటుంబానికి తెలీదు.దీంతో, బలవంతంగా పెళ్లి జరిగిపోయింది.

ఆమెకు అప్పటికే వివాహం జరిగింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ, ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి వారి కులానికి చెందినవాడు కాదని ఆమె తండ్రి చాలా బాధలో ఉన్నాడు. బలవంతంగా, కన్న కూతురికి మరో వ్యక్తితో పెళ్లి చేశాడు. అయితే, తనకు బలవంతంగా రెండోసారి తాళి కట్టిన భర్తకు  ఆమె ఏకంగా రాఖీ కట్టేసింది. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన వ్యక్తికి ఒక్కాగానొక్క కూతురు. ఆమె తండ్రికి ఇష్టం లేకుండా వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి నచ్చని ఆమె తండ్రి, కూతురికి తమ కులానికి చెందిన ఛత్తీస్ గఢ్ లోని అంతఘర్ పట్టణానికి చెందిన మరో వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేశాడు. నిజానికి, ఆమెకు ముందే పెళ్లి జరిగిందనే విషయం ఆ వరుడు కుటుంబానికి తెలీదు.దీంతో, బలవంతంగా పెళ్లి జరిగిపోయింది.

అయితే, తన తండ్రి చేయించిన ఈ రెండో పెళ్లి ఆమెకు అస్సలు ఇష్టం లేదు. అందుకే.. పెళ్లి జరిగిన వెంటనే, తన రెండో భర్త చేతికి రాఖీ కట్టింది. నిజానికి సోదరుడికి సోదరి రాఖీ కడుతుంది. అలాంటిది ఆమె తనకు తాళి కట్టిన భర్తకు రాఖీ కట్టడం గమనార్హం. ఇతనికి రాఖీ కట్టి, ఆమె తన మొదటి భర్త వద్దకు వెళ్లిపోవడం కొసమెరుపు.

ఆమె కాలేజీ రోజుల్లోనో ఓ వ్యక్తిని ప్రేమించింది. ఇంట్లో వారిని ఎదురించి పెళ్లి చేసుకుంది. కాలేజీ చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన పది రోజుల తర్వాత ఆ జంటను మహిళ కుటుంబీకులు గుర్తించి బాలేసర్‌లోని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. వీరిని మహిళ కుటుంబీకులు బలవంతంగా వేరు చేశారు. కానీ, ఇప్పుడు సదరు మహిళ రెండో పెళ్లిని కాదని, తన మొటి భర్త వద్దకు వెళ్లడం విశేషం. ఆమె రెండో భర్త కూడా పూర్తి విషయం తెలిసిన తర్వాత ఆమెకు మద్దతుగా నిలవడం విశేషం. అతనే స్వయంగా వారిద్దరినీ కలపడానికి ప్రయత్నించడం విశేషం. ఈ సంఘటన స్థానికంగా అందరినీ విపరీతంగా ఆకట్టుకోవడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌