మందుబాబులకు బంపర్ ఆఫర్.. సెకండ్ డోస్ తీసుకుంటే పదిశాతం డిస్కౌంట్..

By AN TeluguFirst Published Nov 24, 2021, 12:27 PM IST
Highlights

మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ నగరంలోని మద్యం దుకాణాలు బుధవారం కోవిడ్-19 వ్యాక్సిన్‌ను రెండో డోస్ తీసుకునే వారికి  దేశీ మద్యంపై 10% తగ్గింపును అందజేస్తాయని మంగళవారం ఒక అధికారి తెలిపారు. అయితే, దీనిమీద తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. 

మధ్యప్రదేశ్‌లోని మద్యం దుకాణాలు మందుబాబులకు బంఫర్ ఆఫర్ ఇచ్చాయి. బుధవారం కోవిడ్-19 వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్నవారికి దేశీ మద్యం కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించారు. వివరాల్లోకి వెడితే..

మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ నగరంలోని మద్యం దుకాణాలు బుధవారం కోవిడ్-19 వ్యాక్సిన్‌ను రెండో డోస్ తీసుకునే వారికి  దేశీ మద్యంపై 10% తగ్గింపును అందజేస్తాయని మంగళవారం ఒక అధికారి తెలిపారు. అయితే, దీనిమీద తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. 

ఈ చర్య ప్రజలను liquor తాగేలా ప్రోత్సహిస్తుందని అధికార బిజెపికి చెందిన ఎమ్మెల్యేల నుండి విమర్శలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో కరోనావైరస్ Vaccination program కింద ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి బుధవారం మెగా ప్రచారాన్ని నిర్వహించనుంది.

సితామౌ ఫటక్, భునియాఖేడి, పాత బస్టాండ్‌లో ఉన్న మూడు దుకాణాలలో దేశీ మద్యం కొనుగోలుపై 10% తగ్గింపు ఇవ్వబడుతుందని మాంద్‌సౌర్ జిల్లా ఎక్సైజ్ అధికారి అనిల్ సచన్ తెలిపారు. అయితే ఇది కేవలం బుధవారం రెండవ, చివరి జాబ్ తీసుకునే వ్యక్తులకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందని అతను చెప్పుకొచ్చాడు. 

కరోనా తీవ్రత తగ్గడం, మామూలు జనజీవనం మొదలు అవ్వడంతో జనాల్లో కరోనా అంటే కాస్త భయం పోయిందనే చెప్పాలి. దీంతో మళ్లీ మామూలుగా corona virus ముందటిలా తిరిగేస్తున్నారు. వ్యాక్సిన్లు వేయించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మొదటి డోస్ అయిపోయిన వారు సెకండ్ డోస్ తీసుకోవడంలో కాస్త జాప్యం పాటిస్తున్నారు. దీన్నుంచి ప్రజల్ని కాస్త మోటివేట్ చేయడానికి ఇలాంటి ఆఫర్ తమ వైపు నుంచి ఇస్తున్నట్లు Excise officials అంటున్నారు. 

Covaxin: కరోనా లక్షణాలకు వ్యతిరేకంగా కొవాగ్జిన్ ప్రభావం 50 శాతం.. వెల్లడించిన తాజా అధ్యయనం.. కానీ..

ఈ ఆఫర్ వల్ల Mega Vaccination Campaign సందర్భంగా సెకండ్ వ్యాక్సిన్ డోస్ వేసుకునేలా ఎక్కువమందిని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ దీన్ని అమలు చేస్తామని తెలిపారు.

అయితే, మందసౌర్‌లోని బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సింగ్ సిసోడియా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ చర్య సరైనది కాదని అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని, ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ తీసుకున్న నిర్ణయం అని.. ఇది జనాల్ని మద్యం సేవించేలా  ప్రోత్సహిస్తుందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అంతకుముందు, Madhya Pradesh ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రెండవ డోస్ COVID-19 వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ చివరిలోగా అర్హులైన వారందరికీ టీకాలు వేయాలని గడువు విధించింది.

ఈ నెల ప్రారంభంలో, పొరుగున ఉన్న ఖాండ్వా జిల్లా ఆర్.పి.కిరార్‌లోని జిల్లా ఎక్సైజ్ అధికారి మద్యం దుకాణాలకు కొనుగోలు కోసం వచ్చే వారికి వ్యాక్సినేషన్ అయిందన్న విషయం తెలుసుకున్నాకే అమ్మాలని తెలిపారు. అది కూడా ఓరల్ గా చెబితే సరిపోదని వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూసి దృవీకరించుకున్న తరువాతే వినియోగదారులకు అమ్మకాలు చేపట్టాలని  ఆదేశించారు. నవంబర్ 23 నాటికి, రాష్ట్రంలో మొత్తం 8,12,79,730 యాంటీ-కరోనావైరస్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. 

click me!