వైరల్ వీడియో: ఇతను ఇండియన్ స్పైడర్ మ్యాన్...!

Published : Oct 14, 2022, 04:32 PM IST
 వైరల్ వీడియో:  ఇతను ఇండియన్ స్పైడర్ మ్యాన్...!

సారాంశం

స్పైడర్ మ్యాన్ లెవల్ లో ఇతరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

మన దేశంలో రైలు ఎంత రద్దీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా పండగవేళ మరింత రద్దీగా ఉంటాయి. అలాంటి రైలులో సీటు దొరకడం అంటే మామూలు విషయం కాదు. కనీసం కదలడానికి కూడా స్థలం ఉండదు. అలాంటి సమయంలో కూడా... సీటు దక్కించుకోవడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తాజాగా.. ఓ యువకుడు అనే పని చేశాడు. అయితే... స్పైడర్ మ్యాన్ లెవల్ లో ఇతరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

నిజానికి అక్కడ.. అడుగుపెట్టడానికి కూడా స్థలం లేదు. చాలా మంది ప్రయాణికులు.. కూర్చోవడానికి స్థలం లేదని కిందే పడుకున్నారు. ఇంట్లో హాల్ లో పడుకున్నట్లు పడుకున్నారు. అలాంటి సమయంలో.. ఆ కుర్రాడు.. వాళ్లని దాటి వెళ్లాల్సిన పరిస్థితి. ఎవరిని లేపినా లేచేవాళ్లలాగా లేరు. అందుకే..చాలా తెలివిగా టెక్నిక్ వాడి.. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా.. తాను వెళ్లాల్సిన ప్లేస్ కి వెళ్లాడు. అతని తెలివి చూసి అందరూ వావ్ అంటున్నారు. ఇండియన్ స్పైడర్ మ్యాన్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

వీడియో ప్రకారం ఆ యువకుడు  హ్యాండ్‌రెస్ట్ సహాయంతో స్వింగ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. అతను తన సీటుకు చేరుకునే వరకు తన పాదాలను మొత్తం సమయం గాలిలో ఉంచాడు.

ఈ వీడియోను గౌరంగ్ భరద్వా అనే వినియోగదారు గురువారం ట్విట్టర్‌లో షేర్ చేశారు. పోస్ట్‌ను షేర్ చేస్తున్నప్పుడు.."స్పైడర్‌మ్యాన్ ఇన్ ఇండియా" అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు.

ఈ వీడియోని ఇప్పటి వరకు 39వేల మంది వీక్షించగా.. మూడు వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. ఈ వీడియోకి ఓ నెటిజన్.. "స్పైడర్‌మ్యాన్ - రైల్-వే హోమ్" అని కామెంట్ చేశారు. మరొకరు... చూడటానికి వీడియో బాగుంది కానీ... మన దేశంలో రైల్వేల పరిస్థితి ఎప్పుడు మెరుగుపడుతుందో అంటూ కామెంట్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం