వంటగ్యాస్ మరింత ప్రియం.. సిలిండర్ ధరపై రూ.25 పెంపు.. హైదరాబాదులో వేయికి చేరువలో...

By AN TeluguFirst Published Sep 1, 2021, 10:24 AM IST
Highlights

ఈ పెరిగిన ధరల ప్రకారం, ఒక నిండు సిలిండర్ అంటే 14.2 కిలోల సబ్సిడీ లేని ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్ ధర ఇప్పుడు దేశ రాజధానిలో రూ. 884.50లకు లభిస్తుంది. దీనిప్రకారం కోల్‌కతాలో 14.2 కిలోల ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర రూ .911కు చేరింది. హైదరాబాదులో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 912 రూపాయలు.

న్యూ ఢిల్లీ : గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో దేశంలోని లక్షలాది గృహాలపై దీని ప్రభావం పడనుంది. సబ్సిడీ లేని ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్ ధర రూ. 25 పెరిగింది. ఇది బుధవారం (సెప్టెంబర్ 1, 2021) నుండే అమలులోకి వచ్చింది. 

కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర కూడా పెరిగింది. పెద్ద చమురు మార్కెటింగ్ పిఎస్‌యులు వీటిని ఒక్క సిలిండర్ మీద రూ .75 మేరకు పెంచాయి. 

ఈ పెరిగిన ధరల ప్రకారం, ఒక నిండు సిలిండర్ అంటే 14.2 కిలోల సబ్సిడీ లేని ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్ ధర ఇప్పుడు దేశ రాజధానిలో రూ. 884.50లకు లభిస్తుంది. దీనిప్రకారం కోల్‌కతాలో 14.2 కిలోల ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర రూ .911కు చేరింది. హైదరాబాదులో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 912 రూపాయలు.

సబ్సిడీయేతర LPG సిలిండర్ ధర ఆగస్టు 17 నుండి సిలిండర్‌పై రూ. 25 పెరిగింది. అంతకుముందు జూలై 1 న, సిలిండర్ ధర రూ. 25.50 పెరిగింది. ఎల్ పీజీ ధరలు గత ఏడు సంవత్సరాలలో రెట్టింపు అయ్యాయి. మార్చి 1, 2014 న రూ. 410.50 ధర ఉన్న సిలిండర్‌, ఇప్పుడు రూ. 859.50లకు చేరుకుంది. అంటే డబుల్ కంటే ఎక్కువ.

ప్రస్తుతం ప్రతి సంవత్సరం ఇంటికి ఈ 14.2 కిలోల 12 సిలిండర్లు సబ్సిడీ కింద అందిస్తున్నారు. 12 రీఫిల్స్ వార్షిక కోటాపై ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తం ప్రతి నెలా మారుతుంది. గ్యాస్ సిలిండర్ ధరలు  అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకం రేట్లను బట్టి వాటి హెచ్చుతగ్గులను బట్టి నిర్ణయించబడతాయి.

దీంతోపాటు స్థానిక పన్నుల కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వంట గ్యాస్ రేట్లు మారుతూ ఉంటాయి. సాధారణంగా, సబ్సిడీ లేని ఎల్ పీజీ సిలిండర్ల ధరలు నెలవారీగా సవరించబడతాయి. వీటిల్లో చేసే మార్పులు ప్రతీ నెలా మొదటి తేదీనుంచి అమల్లోకి వస్తాయి. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్,  డీజిల్ రేట్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి. దీనికి ఎల్ పీజీ పెంపూ తోడైంది. దేశంలో ఇప్పటికే పెట్రోల్ ధరలు 100 రూపాయల మార్కును దాటాయి.

IOCL వెబ్‌సైట్ ప్రకారం, ఆగష్టు 17, 2021 నుండి ఇండేన్ 14.2 కేజీల సిలిండర్ సబ్సిడీ లేని ధరలు క్రింది విధంగా ఉన్నాయి :

1) ఢిల్లీ - రూ. 859.50

2) కోల్‌కతా - రూ. 886.50

3) ముంబై - రూ. 859.50

4) చెన్నై - రూ. 875.50

ప్రస్తుతం 25 రూపాయల పెంపుతో, దేశీయ ఎల్ పీజీ సిలిండర్ ధరలు కూడా వివిధ నగరాల్లో పెరుగుతాయి. 

click me!