
నోట్ల రద్దు జరిగి నాలుగు సంవత్సరాలైనా కారణంగా కాంగ్రెస్ పార్టీ.. అధికార బీజేపీని ప్రధాని మోడీని టార్గెట్ చేసాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు బీజేపీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ చంద్రశేఖర్ గట్టి కౌంటరిచ్చారు. ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన నోట్ల రద్దు వల్ల లాభం జరిగిందే తప్ప నష్టం కాదని తేల్చి చెప్పారు.
నోట్ల రద్దు జరిగి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ప్రతిపక్షం దీనిపై ఇంకా ప్రచారం చేస్తుందని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు వల్ల జరిగిన లాభం అధికమని.. అది చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేస్తూ విపక్షం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని రాజీవ్ వ్యాఖ్యానించారు.
Shri Rajeev Chandrasekhar addresses a press conference at BJP headquarters in New Delhi. https://t.co/MBZZohGslr
నోట్ల రద్దు మూడు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని చేయబడింది.
1. దేశ ఆర్ధిక వ్యవస్థను వృద్ధిలోకి తీసుకురావడానికి
2. తీవ్రవాదులకు డబ్బు అందకుండా చేసి ఆ కార్యకలాపాలను ఆపడం.
3. ప్రతి పథకం ప్రజలకు నేరుగా అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు నేరుగా డబ్బును చేర్చడంతో పాటుగా.... వారి జీవన ప్రమాణాలను పెంచడం.
నోట్ల రద్దు వల్ల రూ.207.16 కోట్ల డిజిటల్ లావాదేవీలు, 3.86 లక్షల కోట్ల యూపీఐల ద్వారా లావాదేవీలు జరిగాయని బీజేపీ తన ట్విట్టర్ హేండిల్ ద్వారా తెలిపింది.