పుట్టింటికి వచ్చిన తోబుట్టువుపైనే తమ్ముడి దారుణం

Arun Kumar P   | Asianet News
Published : Jul 04, 2021, 07:21 AM ISTUpdated : Jul 04, 2021, 07:27 AM IST
పుట్టింటికి వచ్చిన తోబుట్టువుపైనే తమ్ముడి దారుణం

సారాంశం

. పుట్టింటికి వచ్చిన అక్కతో తల్లిదండ్రుల కళ్లెదుటే అత్యంత కిరాతకంగా వ్యవహరించాడో కసాయి తమ్ముడు. 

పూణే: తల్లిదండ్రులు అక్కపై ప్రేమను కురిపిస్తూ తనపై వివక్ష చూపిస్తున్నారని భావించిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పుట్టింటికి వచ్చిన అక్కను అత్యంత కిరాతకంగా హతమార్చడానికి ప్రయత్నించాడు. అది కూడా తల్లిదండ్రుల కళ్లెదుటే. ఈ దారుణం మహారాష్ట్రలో చోటుచేసుకుంది.  

పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  పూణేకు చెందిన మనీషా, శంకర్ అక్కా తమ్ముడు. మనీషాకు వివాహమై భర్త, కొడుకుతో కలిసి వేరే ప్రాంతంలో నివాసముంటోంది. శంకర్ మాత్రం తల్లిదండ్రుల వద్దే వుంటున్నాడు. 

read more  డబ్బు ఆశచూపి.. మైనర్ బాలికపై 7గురు గ్యాంగ్ రేప్..!!

మనీషా తల్లిదండ్రులను చూసేందుకు తరచూ పుట్టింటికి వచ్చేది. ఇలాగే శుక్రవారం సాయంత్రం కూడా కొడుకు రోహన్ తో కలిసి పుట్టింటికి వచ్చింది. అయితే రాత్రి పుట్టింట్లో నిద్రిస్తున్న సమయంలో అక్కపై శంకర్ గొడ్డలితో అతి కిరాతకంగా దాడి చేశాడు. తల్లిదండ్రులను బెదిరించి వారు చూస్తుండగానే అక్కపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు దుండగుడు. 

అయితే తల్లిపై దాడి చేస్తున్న మేనమామను అడ్డుకున్న రోహన్ అప్పటికే తీవ్రగాయాలపాలైన ఆమెను హాస్పిటల్ కు తరలించాడు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించగా తనకంటే అక్కపైనే తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమ చూపించడాన్ని తట్టుకోలేక పోయానని... అందువల్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు శంకర్ తెలిపినట్లు సమాచారం.

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్