Legendary Kannada actress Leelavathi: దాదాపు 600 చిత్రాలలో నటించిన లీలావతి మలయాళం, తమిళం, తెలుగు ప్రాజెక్టులలో పనిచేశారు. ఆమె కన్నడ చిత్రమైన మాంగల్య యోగాతో చిత్రసీమలోకి అరంగేట్రం చేశారు.
Kannada actress Leelavathi: ప్రముఖ కన్నడ సినీ నటి లీలావతి శుక్రవారం కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 600 చిత్రాల సినీ ప్రస్థానంలో వెండితెరపై మెరిసిన లీలావతి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడ, తమిళం, తెలుగు, మళయాళం భాషల్లో నటించింది. లీలావతి కన్నడలో 400కు పైగా చిత్రాల్లో నటించారు. "భక్త కుంబర, మన చోసిధ మదాడి, శాంతా తుకారాం" వంటి ఐకానిక్ చిత్రాలలో ఆమె అసాధారణ నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
లీలావతి సినీ ప్రస్థానం ఇదే..
లీలావతి ఆరు దశాబ్దాలకు పైగా సినీ కెరీర్ కొనసాగింది. ఆమె కన్నడ, తమిళం, తెలుగు, మలయాళ భాషలలో సుమారు 600 చిత్రాలలో నటించింది. ఆమె బహుముఖ నటనతో చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1999-2000 లో జీవిత సాఫల్యానికి ప్రతిష్ఠాత్మక డాక్టర్ రాజ్ కుమార్ అవార్డును అందుకున్నారు. అలాగే, 2008 లో తుమకూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ తో సహా అనేక ప్రశంసలను అందుకుంది.
ఎవరీ Leelavathi..?
కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడిలో జన్మించిన లీలావతి చిన్న వయసులోనే నాటకరంగంపై మక్కువ పెంచుకుంది. నటనకు పూర్తిగా కమిట్ కాకముందు ఇంటి బాధ్యతలను కూడా నిర్వహించింది. 1949లో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత కన్నడ చిత్రసీమలో ప్రముఖ నటిగా ఎదిగారు. లీలావతికి కుమారుడు వినోద్ రాజ్ ఉన్నారు. ఆయన కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ నటుడు.
లీలావతి 1949 లో శంకర్ సింగ్ నాగకన్నికే చిత్రంతో తెరంగేట్రం చేసింది. తరువాత కన్నడ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. మహాలింగ భాగవతార్ నాటక సంస్థలో సుబ్బయ్య నాయుడు సహచరిగా నటించి పలు నాటకాల్లో కూడా నటించింది. సుబ్బయ్య నాయుడు ప్రదర్శించిన భక్త ప్రహ్లాద చిత్రంలో సఖి పాత్రను పోషించారు. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో చేస్తున్న క్రమంలోనే ఆమెకు కథానాయికగా అవకాశం వచ్చింది. కథానాయికగా ఆమె నటించిన మొదటి చిత్రం మంగళ్యా యోగా. డా.రాజ్ కుమార్ తో ఆమె నటించిన తొలి చిత్రం రణధీర కంఠీరవ.
లీలావతి అందుకున్న అవార్డులు, ప్రత్యేక పురస్కారాలు ఇవే..
2008 - తుమకూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్
2006 - ఉత్తమ సహాయ నటి ఫిల్మ్ ఫేర్ అవార్డు
1999-2000 - డాక్టర్ రాజ్ కుమార్ జీవిత సాఫల్య పురస్కారం
ఆమె ప్రత్యేక నటనకు గానూ మూడు సార్లు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు కూడా అందుకున్నారు.
1960-70 - గెజ్జే పూజే
1971-72 - సిపాయి రాము
1989-90 - డాక్టర్ కృష్ణ