
Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఈ ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ సర్కారుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. మహిళలు, బాలికలపై దారుణమైన నేరాలు రాష్ట్రంలో ఎందుకు పెరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అక్కడి బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మీడియా కథనాల ప్రకారం, ఇద్దరు బాలికలు బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో చెట్టుకు ఉరివేసుకుని కనిపించారు. ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. లఖింపూర్ ఖేరీ (ఉత్తరప్రదేశ్) లో ఇద్దరు అక్కాచెల్లెళ్ల హత్య హృదయ విదారకంగా ఉంది. పట్టపగలు బాలికలను అపహరించినట్లు బంధువులు చెబుతున్నారు’’ అని ప్రియాంక గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.
"ప్రతిరోజూ వార్తాపత్రికలు, టెలివిజన్లలో తప్పుడు ప్రకటనలు ఇవ్వడం వల్ల శాంతిభద్రతలు మెరుగుపడవు. అన్నింటికంటే, ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై క్రూరమైన నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి?" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై ఇలాంటి దారుణ ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుందని ప్రశ్నించారు. ముగ్గురు వ్యక్తులు అపహరించిన తర్వాత బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతున్నాయని ఆమె ట్విట్టర్‌లో మీడియా నివేదికను పంచుకున్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని నిఘాసన్ ప్రాంతంలో ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు బుధవారం అనుమానాస్పద స్థితిలో చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అయితే ముగ్గురు వ్యక్తులు తమ పిల్లలను కిడ్నాప్ చేసి హత్య చేశారని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. బాధితుల తల్లి మీడియాతో మాట్లాడుతూ.. బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 15, 17 ఏళ్ల వయసున్న తోబుట్టువులు తన తల్లితో కలిసి ఇంటి బయట కూర్చొని ఉన్నారు. కొంత సమయం తరువాత తల్లి ఇంట్లోకి వెళ్లింది. దీంతో ఓ ముగ్గురు యువకులు బైక్ పై అక్కడికి చేరుకున్నారు. వారు ఇద్దరు కూతుళ్లను కిడ్నాప్ చేశారు. ఇది జరిగిన తర్వాత బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయని తెలిపారు.
ముగ్గురు యువకులు పొరుగు గ్రామం లాల్పూర్ చెందిన వారని మృతుల తల్లి చెప్పారు. ‘‘నేను స్నానం చేయడానికి లోపలికి వెళ్లారు. అదే సమయంలో ముగ్గురు నిందితులు మోటర్ బైక్‌పై వచ్చారు. వారు పసుపు, తెలుపు, నీలం రంగు టీషర్టులు ధరించారు. ఇద్దరు నిందితులు నా కుమార్తెలను ఎత్తుకెళ్లి బైక్‌పై పారిపోయారు ’’ అని బాధితుల తల్లి చెప్పినట్టు ‘హిందుస్థాన్ టైమ్స్’ పేర్కొంది. ఈ తర్వాత వారి కోసం వెతుకగా, చెట్టుకు వేలాడుతూ కనిపించారు.