ముష్కరుల తూటాలకు బలైన భర్త...సైన్యంలోకి భార్య

By Siva KodatiFirst Published Feb 25, 2019, 3:47 PM IST
Highlights

దేశం కోసం భర్త అమరవీరుడైతే ఆయనకు నివాళిగా అతని అడుగుజాడల్లోనే నడిచి సైన్యంలో చేరాలనుకుంటున్నారు ఓ అమరవీరుడి భార్య. వివరాల్లోకి వెళితే.. 2017 డిసెంబర్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌‌లోని తవాంగ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు భారత జవాన్ల ఔట్‌పోస్ట్‌పై కాల్పులు జరిపారు. 

ఈ ఘటనలో మేజర్ ప్రసాద్ మహదీక్ ప్రాణాలు కోల్పోయారు. ఇయనకు 2015లో గౌరీతో వివాహమైంది. దేశ రక్షణ కోసం భర్త ప్రాణత్యాగం చేయడం గౌరీలో స్పూర్తిని రగిలించింది. వెంటనే మరో ఆలోచన లేకుండా తాను కూడా భర్త ఆశయ సాధనలో భాగంగా సైన్యంలో చేరనుంది.

వృత్తిరీత్యా న్యాయవాది అయిన గౌరీ ఆర్మీలో చేరేందుకు గాను సర్వీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్ష రాశారు. ఈమెతో పాటు మరో 16 మంది అమరులైన అధికారుల భార్యలు కూడా పరీక్ష రాశారు.

ఈ పరీక్షలో గౌరీ తొలి స్ధానంలో నిలిచారు. దీంతో ఆమె చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ తీసుకోనున్నారు. ఏప్రిల్ నుంచి ఇది ప్రారంభంకానుంది.

ట్రైనింగ్ తర్వాత వచ్చే ఏడాది లెఫ్టినెంట్ హోదాలో గౌరీ ఇండియన్ ఆర్మీలో చేరనున్నారు. దీనిపై ఆమె మాట్లాడుతూ...డిసెంబర్‌‌లో తాను ఈ పరీక్ష రాశానని, వివిధ ఘటనల్లో అమరులైన ఆర్మీ అధికారుల భార్యలకు సర్వీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్ష నిర్వహించినట్లు  తెలిపారు.

తన భర్తకు నివాళిగా తాను కూడా ఆర్మీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. విధుల్లో భాగంగా ప్రసాద్ వేసుకున్న యూనిఫారంనే తాను కూడా ధరించనున్నానని ఉద్వేగంతో  తెలిపారు. 

click me!