సమీప బంధువును హత్య చేసి.. తలతో సెల్ఫీ.. జార్ఖండ్ లో దారుణం..

By SumaBala BukkaFirst Published Dec 6, 2022, 10:15 AM IST
Highlights

జార్ఖండ్ లో ఓ వ్యక్తి తన సమీప బంధువును హత్య చేసి.. తలతో సెల్ఫీ దిగాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, అతని భార్య సహా ఆరుగురిని ఆదివారం అరెస్టు చేశారు.

జార్ఖండ్ : భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి తన బంధువును నరికి చంపాడు. జార్ఖండ్ లో ఈ దారుణ ఘటన చోటు చేసకుంది. భూ వివాదం కారణంగా 20 ఏళ్ల గిరిజన యువకుడు.. తన 24 ఏళ్ల బంధువు తల నరికి చంపాడు. ఆ తరువాత నిందితుడి స్నేహితులు నరికిన తలతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో సోమవారం జరిగిందని పోలీసులు తెలిపారు. ఇటీవల ముర్హు ప్రాంతంలో ఈ ఘటన కలకలం రేపింది. 

మృతుడి తండ్రి దాసాయి ముండా డిసెంబర్ 2న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ప్రధాన నిందితుడు, అతని భార్య సహా ఆరుగురిని ఆదివారం అరెస్టు చేశారు.  55 ఏళ్ల ఆ వ్యక్తి తన  ఎఫ్‌ఐఆర్‌లో.. తన కుమారుడు కనుముండా డిసెంబర్ 1న ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. మిగతావారు పని కోసం బయటికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి.. తన కొడుకును.. తన మేనల్లుడు సాగర్ ముండా, అతని స్నేహితులు అపహరించినట్లు  గ్రామస్తులు తెలిపారు. దీతో కనుముండా జాడ కోసం అనేక చోట్లా వెతికారు. కానీ, ప్రయత్నాలు విఫలమవ్వడంతో, అతని తండ్రి మరుసటి రోజు పీఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు.

డిప్రెషన్‌తో 10వ అంతస్తు బాల్కనీ నుంచి దూకేసిన ఎన్నారై వ్యాపారి

నిందితులను పట్టుకునేందుకు ఖుంటి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అమిత్ కుమార్ నేతృత్వంలో పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన తరువాత, మొండెం కుమాంగ్ గోప్లా అడవిలో, తల 15 కిలోమీటర్ల దూరంలో దుల్వా తుంగ్రీ ప్రాంతంలో కనుగొనబడిందని ముర్హు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ చూడామణి టుడు తెలిపారు. నరికిన తలతో నిందితులు సెల్ఫీ తీసుకున్నారని అధికారి తెలిపారు. మృతుడితో సహా ఐదు మొబైల్ ఫోన్లు, రెండు రక్తపు మరకలున్న పదునైన ఆయుధాలు, గొడ్డలి, ఒక ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఓ భూమి విషయంలో మృతుల కుటుంబాలకు, నిందితులకు మధ్య చాలా కాలంగా ఉన్న గొడవలే ఈ హత్యకు కారణమని అధికారి తెలిపారు.

click me!