Lalu Prasad Yadav health update:  లాలూ ఆర్యోగ పరిస్థితి విష‌మం.. సింగ‌పూర్ కు త‌ర‌లించ‌డం క‌ష్టమే.. : తేజస్వీ

Published : Jul 08, 2022, 04:21 AM IST
Lalu Prasad Yadav health update:  లాలూ ఆర్యోగ పరిస్థితి విష‌మం.. సింగ‌పూర్ కు త‌ర‌లించ‌డం క‌ష్టమే.. : తేజస్వీ

సారాంశం

Lalu Prasad Yadav health update:  లాలూ ప్ర‌సాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో, మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్‌లో అతన్ని ఢిల్లీకి తరలించారు. ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే..  లాలూ ఆరోగ్యంపై పలు పుకార్లు షికార్లు చేయ‌డంతో తేజశ్వి యాద‌వ్ స్పందించారు. 

Lalu Prasad Yadav health update: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ ఆరోగ్యంపై అనేక పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ స్పందించారు. ఆయ‌న హెల్త్ గురించి.. బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. లాలూ ప్రసాద్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, ఎలాంటి తప్పుదోవ పట్టించే వార్తల గురించి ఆందోళన చెందవద్దని తేజస్వీ యాదవ్ అన్నారు. మెరుగైన వైద్యం కోసం.. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ను హూటాహుటినా బుధవారం రాత్రి పాట్నాలోని ఆస్ప‌త్రి నుంచి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో త‌ర‌లించారు. 

ఈ క్ర‌మంలో.. తప్పుడు సమాచారం, పుకార్లకు తీవ్ర‌మయ్యాయి. ఆయ‌న ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింద‌నీ, లాలూ ఆరోగ్యం ప‌రిస్థితి విష‌మించిందని ప‌లు పుకార్లు షికార్లు చేశాయి. వీట‌న్నింటికీ తేజస్వి యాదవ్
ముగింపు ప‌లుకుతూ.. ట్వీట్ చేశారు.  "మా జాతీయ అధ్యక్షుడు, మా నాన్నగారు, గౌరవనీయులైన శ్రీ లాలూ ప్రసాద్ జీ ఆరోగ్యం మెరుగుపడుతోంది. అతను ఇంటెన్సివ్ మెడికల్ అబ్జర్వేషన్‌లో ఉన్నాడు మరియు అతని పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. నేను కోరుతున్నాను. మద్దతుదారులు, కార్మికులు, దేశప్రజలు ఎలాంటి తప్పుదోవ పట్టించే వార్తల గురించి ఆందోళన చెందవద్దు. ధన్యవాదాలు."అని ట్విట్ చేశారు.

ఇదిలా ఉంటే.. పాట్నాలోని ఓ ఆసుపత్రిలో లాలూ ప్రసాద్ యాదవ్ భుజం సహా మూడు చోట్ల 'ఫ్రాక్చర్'కు ప్రాథమిక చికిత్స చేయడం గమనార్హం. లాలూ తన ఇంట్లో పడిపోయాడు, దాని కారణంగా అతడు తీవ్రంగా గాయాలపాలయ్యారు.

అంతకుముందు తేజస్వి యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ.. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఇంట్లో పడిపోవడం వల్ల ఆయ‌న‌కుభుజంతో సహా మూడు చోట్ల ఫ్రాక్చర్  అయ్యిందని, అతడు పెద్దగా కదలలేకపోతున్నాడని చెప్పాడు. అంతకుముందు, సోమవారం ఆరోగ్యం క్షీణించడంతో లాలూను పాట్నాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధ‌వారం నాడు  పాట్నా ఆసుపత్రికి చేరుకుని ప్రసాద్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రసాద్ భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. సింగపూర్‌కు వెళ్లడం సాధ్యమేనా అని తేజశ్విని అడిగిన ప్రశ్నకు.. అతను రెండు వారాల్లో ఆయ‌న ఆరోగ్యం మెరుగుప‌డితే.. సింగపూర్‌కు తీసుకువెళతామని  చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !