ఇండిపెండెన్స్ డే: సంప్రదాయ నృత్యం చేసిన లడఖ్ ఎంపీ

Published : Aug 15, 2019, 01:17 PM IST
ఇండిపెండెన్స్ డే: సంప్రదాయ నృత్యం చేసిన లడఖ్ ఎంపీ

సారాంశం

లడఖ్ ఎంపీ ఇండిపెండెన్స్ ను పురస్కరించుకొని సంప్రదాయ నృత్యం చేశారు. స్థానికులు కూడ ఎంపీతో కలిసి డ్యాన్స్ చేశారు. 

లడఖ్: లడఖ్ ఎంపీ జమ్యాంగ్ టెర్సింగ్ నాంగ్యాల్ గురువారం నాడు స్థానికులతో కలిసి డ్యాన్స్ చేశాడు. స్థానిక గిరిజన సంప్రదాయం చేశారు. ఆయనను స్థానికులు ఉత్సహపర్చారు.

లడఖ్ ప్రాంతంలో సంప్రదాయ గౌచ నృత్యం చేశారు. ఎంపీతో స్థానికులు కూడ ఆయనతో పాటే డ్యాన్స్ చేశారు. ఎంపీ నల్లకల్లద్దాలను ధరించి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.

స్థానికులు వేసుకొనే సంప్రదాయ దుస్తులను ధరించి ఆయన ఈ డ్యాన్స్ చేశారు.అంతేకాదు స్థానికులతో కలిసి డ్రమ్స్ వాయించారు. లడఖ్ ను కేంద్రపాలిత ప్రకటించిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఇండిపెండెన్స్ డే ఉత్సవాల్లో ఆయన డ్యాన్స్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండుగా విభజించడంపై పార్లమెంట్ లో బిల్లును పెట్టిన సమయంలో  లడఖ్ ఎంపీ జమ్యాంగ్ టెర్సింగ్ నాంగ్యాల్  చేసిన ప్రసంగం పలువురిని ఆకట్టుకొంది.

జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడాన్ని సమర్ధిస్తూ ఆయన ప్రసంగించారు

PREV
click me!

Recommended Stories

Interesting Facts : మనం ఏడ్చినప్పుడు ముక్కు ఎందుకు కారుతుంది..?
UPSC Interview Questions : గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగానే ఎందుకు మారతాయి..?