అసమ్మతి నేతలు తిరిగొస్తారు, 21న విస్తరణ: సిద్దూ

Published : Jul 09, 2019, 12:13 PM ISTUpdated : Jul 09, 2019, 12:17 PM IST
అసమ్మతి నేతలు తిరిగొస్తారు, 21న విస్తరణ: సిద్దూ

సారాంశం

ఈ నెల 21వ తేదీన కుమారస్వామి కేబినెట్‌ను విస్తరించనున్నట్టు కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష నేత సిద్ద రామయ్య చెప్పారు.  

బెంగుళూరు:  ఈ నెల 21వ తేదీన కుమారస్వామి కేబినెట్‌ను విస్తరించనున్నట్టు కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష నేత సిద్ద రామయ్య చెప్పారు.

మంగళవారం నాడు  బెంగుళూరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.  గత ఎన్నికల్లో తమకే ఎక్కువ ఓట్లు వచ్చినట్టుగా ఆయన చెప్పారు. రామలింగారెడ్డి సహా అసమ్మతి నేతలంతా తమ వైపుకు తిరిగి వస్తారని  ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని సిద్దరామయ్య ఆరోపించారు. ఇప్పటికే ఐదు దఫాలు బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు చేసిందని  చెప్పారు.

తమ కూటమికి చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. అయితే బీజేపీకి ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?