12-17 ఏళ్ల మ‌ధ్య పిల్ల‌ల‌కు కోవోవాక్స్ ను ఇవ్వొచ్చు.. సిఫార్సు చేసిన కోవిడ్ -19 వ‌ర్కింగ్ గ్రూప్

Published : Apr 04, 2022, 11:02 AM IST
12-17 ఏళ్ల మ‌ధ్య పిల్ల‌ల‌కు కోవోవాక్స్ ను ఇవ్వొచ్చు.. సిఫార్సు చేసిన కోవిడ్ -19 వ‌ర్కింగ్ గ్రూప్

సారాంశం

12-17 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలకు అందించేందుకు మరో కరోనా వ్యాక్సిన్ ను కోవిడ్ -19 వర్కింగ్  గ్రూప్ సిఫార్సు చేసింది. ఈ వ్యాక్సిన్ పేరు కోవోవాక్స్‌. ఇది మార్చి 9వ తేదీన అత్యవసర వినియోగానికి ఆమోదం పొందింది. కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతులు లభిస్తే ఈ వ్యాక్సిన్ ను పిల్లలకు అందిస్తారు. 

సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) తయారు చేసిన Covovax వ్యాక్సిన్‌ను 12 - 17 ఏళ్ల మ‌ధ్య పిల్ల‌లకు ఇవ్వొచ్చ‌ని కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI) కు సిఫార్సు చేసింది. ఈ విష‌యాన్ని అధికార వ‌ర్గాలు ఆదివారం వెల్ల‌డించాయి.

కోవోవాక్స్‌ను డిసెంబరు 28వ తేదీన పెద్దవారిలో, 12-17 ఏళ్ల వయస్సులో పిల్ల‌ల‌కు కొన్ని షరతులకు లోబడి, మార్చి 9న అత్యవసర పరిస్థితుల్లో పరిమితం చేయడానికి గ‌త నెల‌లో అనుమ‌తి ఇచ్చింది. ఇదిలా ఉండగా  SII కు చెందిన గవర్నమెంట్ అండ్ రెగ్యులేటరీ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. రోగనిరోధకత డ్రైవ్‌లో కోవోవాక్స్‌ను చేర్చాలని అభ్యర్థించారు.

‘‘ఎన్‌టీఏజీఐ కు చెందిన కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్  సమావేశం ఏప్రిల్ 1న జరిగింది. ఇందులో కోవోవాక్స్ డేటాను సమీక్షించారు. ఆ తర్వాత 12 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న‌ వారికి టీకాలు వేయడానికి జాతీయ కోవిడ్-19 టీకా కార్యక్రమంలో టీకాను చేర్చవచ్చని సిఫార్సు చేసింది. ’’ అని అధికారి ఒక‌రు తెలిపారు. 
 
పూణేకు చెందిన ఈ సంస్థ కోవోవాక్స్‌ను ప్రైవేట్ ఆసుపత్రులకు డోస్‌కు రూ. 900తో పాటు జీఎస్‌టీతో కలిపి అందించాల‌ని కోరుకుంటోందని ప్రకాష్ కుమార్ సింగ్ తెలిపారు. వాటిని కేంద్రానికి సరఫరా చేసే ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని ఆయ‌న చెప్పారు. అయితే ప్రభుత్వానికి ఎంత ధ‌ర‌కు వ్యాక్సిన్ అందిస్తార‌న్న‌ది మాత్రం ఆయ‌న పేర్కొన‌లేదు. కాగా మ‌న దేశంలో మార్చి 16 నుంచి 12-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు టీకాలు వేయ‌డాన్ని ప్ర‌భుత్వం ప్రారంభించింది. అయితే ప్ర‌స్తుతం వీరికి బయోలాజికల్ E's Corbevax ను అందిస్తున్నారు. 

ప్రైవేట్ కంపెనీలు, విద్యా సంస్థలు, సామాజిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు తమ సిబ్బంది, కుటుంబాలు, పిల్లలకు టీకాలు వేయాలని కోవోవాక్స్ కోసం అభ్యర్థనలు చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్‌కు రాసిన లేఖలో ప్రకాష్ కుమార్ సింగ్ తెలిపిన‌ట్టు తెలుస్తోంది. 

“ ఎంతో దూర‌దృష్టి ఉన్న మా CEO అడార్ సి పూనావల్ల నాయకత్వంలో మేము 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వ‌య‌స్సు ఉన్న వారి కోసం Covovax అనే మరో ప్రపంచ స్థాయి కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసాము, అయితే ఇది డిసెంబ‌ర్ 28వ తేదీన ఆమోదం పొందింది. అలాగే 12-17 సంవ‌త్స‌రాల పిల్ల‌ల కోసం మార్చి 9వ తేదీ అత్యవసర వినియోగ ఆమోదాన్ని పొందాము.’’ అని ప్ర‌కాష్ కుమార్ సింగ్ లేఖ‌లో పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు
IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ