ఏడుగురి సజీవ దహనం: ఖైదీకి క్షమాభిక్షకు నో చెప్పిన రాష్ట్రపతి

First Published Jun 3, 2018, 4:58 PM IST
Highlights

మెర్సీ పిటిషన్ తిరస్కరించిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ ఖైదీ క్షమాభిక్ష
పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం నాడు
తిరస్కరించారు. 

రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా
క్షమాభిక్ష పిటిషన్ ను రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు.

  ఏడుగురు కుటుంబసభ్యులను సజీవంగా దహనం చేసిన  
జగత్ రాయ్ అనే వ్యక్తికి సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించింది.
2006లో బిహార్‌కు చెందిన విజేంద్ర మహతోతో పాటు అతని
ఏడుగురు కుటుంబసభ్యులను అత్యంత దారుణంగా హత్య
చేశాడు.

 జగత్‌ రాయ్‌, వజీర్‌ రాయ్‌, అజయ్‌ రాయ్‌లు తన గేదెను
దొంగలించారంటూ మహతో 2005 సెప్టెంబరులో పోలీసు
స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు వెనక్కి తీసుకోవాలని
నిందితులు మహతోను ఒత్తిడి చేశారు. కేసు పెట్టాడని
కోపగించిన జగత్ రాయ్‌    మహతో ఇంటికి నిప్పంటించాడు.

ఆ ఘటనలో మిగతా కుటుంబ సభ్యులు మరణించగా  తీవ్ర
గాయలపాలైన మహతో చికిత్స పొందుతూ కొన్ని నెలల
తరవాత చనిపోయాడు. ఆ నేరం కింద జగత్ రాయ్‌కు స్థానిక
కోర్టు, హైకోర్టు ఉరిశిక్ష విధించింది. 2013లో సుప్రీం కూడా
అతడిని ఉరి తీయాలంటూ తీర్పు నిచ్చింది. దాంతో జగత్‌
రాయ్‌ క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి అభ్యర్థన చేసుకున్నాడు.
కానీ, ఏప్రిల్ 23, 2018న రాష్ట్రపతి ఈ అభ్యర్థనను
తిరస్కరించినట్లు రాష్ట్రపతి భవన్‌ వెల్లడించింది.
 

click me!