Bird Flu Outbreak in Kerala: బర్డ్ ఫ్లూ టెన్షన్ .. వేలాది బాతులు, కోళ్లను చంపేదుకు ప్రత్యేక బృందాలు

Siva Kodati |  
Published : Dec 15, 2021, 04:06 PM IST
Bird Flu Outbreak in Kerala:  బర్డ్ ఫ్లూ టెన్షన్ .. వేలాది బాతులు, కోళ్లను చంపేదుకు ప్రత్యేక బృందాలు

సారాంశం

ఇప్పటికే కరోనా మహమ్మారితో (coronavirus) అల్లాడుతోన్న కేరళను (kerala) బర్డ్ ఫ్లూ (bird flu)  వైరస్ టెన్షన్ పెడుతోంది. రాష్ట్రంలో మూడు బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి రావటంతో వేలాది కోళ్లను , బాతుల్ని చంపేస్తున్నారు.

ఇప్పటికే కరోనా మహమ్మారితో (coronavirus) అల్లాడుతోన్న కేరళను (kerala) బర్డ్ ఫ్లూ (bird flu)  వైరస్ టెన్షన్ పెడుతోంది. రాష్ట్రంలో మూడు బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి రావటంతో వేలాది కోళ్లను , బాతుల్ని చంపేస్తున్నారు. పక్షుల నుంచి మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ సోకుతుందనే నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో వేలాది పక్షుల్ని చంపేస్తున్నారు. కొట్టాయం (kottayam) జిల్లాలోని వేచూర్, అయమనమ్, కల్లార పంచాయతీలలో పక్షుల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్ఐ‌హెచ్ఎస్ఏడీ)లో పరీక్షించగా బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయింది.

దీంతో వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గతవారం పొరుగున ఉన్న అలప్పుజ జిల్లాలోనూ బర్డ్ ఫ్లూ వెలుగులోకి రాగా నియంత్రణ చర్యల్లో భాగంగా పక్షులను చంపేశారు. తాజా కేసులతో కోళ్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. అలప్పుజలో బాతులను చంపి తగలబెట్టేశారు. ఇప్పుడు కొట్టాయంలోనూ ఇలాగే చేయాలని అధికారులు నిర్ణయించారు.

Bird flu : కేరళలో కలవర పెడుతున్న బర్డ్ ఫ్లూ.. కోళ్లు, బాతులు చంపాలని ఆదేశించిన అధికారులు...

కాగా.. గత కొన్ని వారాలుగా అలప్పుజాలో (alappuzha) బాతులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. ఒక్క పంచాయతీలోనే ముగ్గురు రైతులకు చెందిన 8 వేలకు పైగా బాతులు చనిపోయాయి. ఇటువంటి పరిస్థితి కొట్టాయంలో రాకుండా ఉండాలనే యంత్రాంగం భావిస్తోంది. బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకే ప్రమాదం తక్కువగానే ఉన్నప్పటికీ..అది మనుషులకు సంక్రమిస్తే మాత్రం సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. 

మరోవైపు పక్షుల సామూహిక హననం కోసం పలు బృందాలు ఆయా గ్రామాలకు చేరుకున్నాయి. ప్రతి బృందంలో ఓ పశువైద్యుడు, ఒక పర్యవేక్షకుడు, ముగ్గురు సహాయకులు ఉంటారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం బర్డ్ ఫ్లూ కనుక నిర్ధారణ అయితే 28,500 నుంచి 35,000 పక్షులను చంపేయాల్సి ఉంటుంది. అయితే రైతులు నష్టపోకుండా ప్రభుత్వం వారికి పరిహారం చెల్లించనుంది. దీంట్లో భాగంగా 60 రోజుల కంటే తక్కువ వయస్సు ఉన్న బాతులకు రూ.100, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న బాతులకు రూ.200 పరిహారం అందజేయనున్నారు అధికారులు. 
 

PREV
click me!

Recommended Stories

Why People Share Everything on WhatsApp Status? | Psychology on WhatsApp Status| Asianet News Telugu
Cigarette Price: 20 రూపాయ‌లున్న సిగ‌రెట్ ధ‌ర ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత ఎంత కానుందో తెలుసా.?